https://oktelugu.com/

Sai Dharam Tej : విజయవాడ వరద ప్రాంతాల్లో హీరో సాయి ధరమ్ తేజ్ పర్యటన.. ఏ హీరో చేయని సహాయం చేయబోతున్న మెగా హీరో!

ఈ సినిమాలో ఆయనకీ సంబంధించిన లుక్ ఇంకా బయటకు రాలేదు కానీ, హీరోయిన్ గా నటిస్తున్న ఐశ్వర్య లెక్ష్మి కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని ఇటీవలే విడుదల చేసారు. చూసేందుకు ఆమె గెటప్ కాస్త కొత్తగా ఉంది. సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా తో పాన్ ఇండియా లెవెల్ లో భారీ హిట్ కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు.

Written By:
  • NARESH
  • , Updated On : September 9, 2024 / 09:48 PM IST
    Follow us on

    Sai Dharam Tej : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిన వరదలు ప్రజల జీవితాలను ఎన్ని కష్టాల్లోకి నెట్టేసిందో మన కళ్లారా రోజూ చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా విజయవాడ ప్రాంతం ఇంకా నీటి నుండి బయటకి రాలేదు. అనే గ్రామాలు నీటిలోనే మగ్గిపోయి ఉన్నాయి. ప్రభుత్వం తరుపున సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదంటే, వరద సృష్టించిన బీభత్సం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గత నాలుగైదు రోజులుగా బుడమేరు వాగు గట్టు వద్దనే కూర్చొని, వరదకు కారణమైన మూడు గండ్లను పూడ్చేసారు. దీంతో వరద తీవ్రత దాదాపుగా తగ్గింది. మరో రెండు రోజుల్లో పేరుకున్న నీళ్లు కూడా బయటకి వెళ్లనున్నాయి. అయితే ఈ వరద సమయంలో టాలీవుడ్ హీరోలు ప్రజలకు ఎంతలా అండగా నిలబడ్డారో మనమంతా చూస్తూనే ఉన్నాం. చిన్న హీరోల దగ్గర నుండి, సూపర్ స్టార్స్ వరకు ప్రతీ ఒక్కరు తమకు తోచిన సహాయం చేసారు.

    కానీ హీరోయిన్స్ మాత్రం కేవలం ఒకరిద్దరు తప్ప ఎవ్వరూ రూపాయి సహాయం కూడా చేయకపోవడం గమనార్హం. ఇదంతా పక్కన పెడితే ఈమధ్య కాలం లో పొలిటికల్ ట్వీట్స్ ఎక్కువగా వేస్తున్న ప్రముఖ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన వంతు సహాయంగా వరదకు బలైన రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 25 లక్షల రూపాయిలు సీఎం రిలీఫ్ ఫండ్స్ కి విరాళం అందించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు వినిపిస్తున్న మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ నెల 12 వ తేదీ నుండి ఆయన విజయవాడ వరద ముంపు ప్రాంతాలలో పర్యటించబోతున్నట్టు తెలుస్తుంది. ఆ ప్రాంతాలలో పర్యటించి, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, బట్టలు పంచే కార్యక్రమం తలపెట్టినట్టు తెలుస్తుంది. ఈమధ్య కాలం లో సాయి ధరమ్ తేజ్ ఎక్కువగా పొలిటికల్ చర్చలు చేస్తుండడం తో భవిష్యత్తులో ఆయన జనసేన పార్టీ తరుపున ఎక్కడి నుండైనా పోటీ చేయబోతున్నాడా అనే సందేహాలు అభిమానుల్లో తలెత్తాయి.

    వరుస హిట్స్ తో మంచి జోష్ మీద సాయి ధరమ్ తేజ్, సినిమాల వరకు చూసుకుంటే చాలు, రాజకీయం అనే బురదలోకి దూకొద్దు, మీ బాబాయి ఉన్నాడు ఆయన చూసుకుంటాడు మొత్తం, నువ్వు ప్రశాంతం గా సినిమాలు చేసుకో అని అభిమానులు సోషల్ మీడియా లో సాయి ధరమ్ తేజ్ ని ట్యాగ్ చేసి సలహా ఇస్తున్నారు. ఇకపోతే సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వంద కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ఒక పీరియడ్ సినిమా తియ్యబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ఆయనకీ సంబంధించిన లుక్ ఇంకా బయటకు రాలేదు కానీ, హీరోయిన్ గా నటిస్తున్న ఐశ్వర్య లెక్ష్మి కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని ఇటీవలే విడుదల చేసారు. చూసేందుకు ఆమె గెటప్ కాస్త కొత్తగా ఉంది. సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా తో పాన్ ఇండియా లెవెల్ లో భారీ హిట్ కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు.