Asia Cup 2023: ఆసియాకప్ సాన్నహక శిబిరం రెండు రోజుల క్రితం వరకు ఆలూరులో నిర్వహించారు. ఇందులో ఒక ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి బ్యాటింగ్ చేశాడు. రోహిత్ ఓపెనర్‌గా సూపర్ సక్సెస్ అయినప్పటికీ, కేఎల్.రాహుల్ ఇంకా ఫిట్‌గా లేకపోవడంతో రోహిత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు క్రికెట్ నిపుణులు. సెప్టెంబర్ 2న క్యాండీలో జరిగే ఆసియా కప్ 2023లో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో.. శుభ్‌మాన్ గిల్‌తో కలిసి ఇషాన్ ఓపెనింగ్ చేస్తాడని.. రోహిత్‌ను నంబర్ 3, విరాట్ కోహ్లీని నంబర్ 4 స్థానంలో పంపే అవకాశంపై కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆలోచిస్తున్నారు.
కుదురుకోని మిడిలార్డర్
మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానం విషయంలో భారత్ గత కొన్నేళ్లుగా సమస్య ఎదుర్కొంటోంది. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ రాణిస్తున్నా.. గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యాడు. ప్రపంచకప్ 2023 ముందు అయ్యర్‌కు గాయం తిరగబెడితే పరిస్థితి ఏంటన్న ఆందోళన కూడా మేనేజ్‌మెంట్ ఉంది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు కేఎల్ రాహుల్ అందుబాటు ఉండడని ద్రవిడ్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఇషాన్ కిషన్‌కు స్థానం ఖాయమైంది.
రోహిత్‌కు జోడీగా..
ఓపెనింగ్‌లో కుదురుకున్న రోహిత్‌కు జతగా ఇపుపడు ఇషాన్ కిషన్‌ను ఖాయం చేసినట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు ఇషాన్, శుభ్‌మన్‌ను ఓపెనింగ్ చేయించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావించింది. కానీ, కీలక మ్యాచ్‌లో ఇద్దరు కొత్తవారితో ప్రయోగం చేయడం సరికాదని అంచనావకు వచ్చింది. దీంతో రోహిత్‌కు జోడీగా ఇషాన్‌ను ఖాయం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మాజీ ప్లేయర్ కృష్ణమాచార్య శ్రీకాత్ తెలిపారు. గిల్, కోహ్లీ 3, 4వ స్థానాల్లో దిగుతారని అంచనా వేశారు.
నంబర్ 4 కోసం అన్వేషణ..
యువరాజ్ సింగ్ వైదొలిగాక.. భారత్ వన్డే జట్టులో నంబర్ 4 కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. కేఎల్.రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ను ఈ స్థానం కోసం ఉపయోగించగా.. గాయాలు వారిని వెంటాడాయి. రాహుల్ కూడా ఓపెనింగ్ స్పాట్‌కు ప్రమోట్ చేయాల్సి వచ్చింది. 2019 ప్రపంచకప్ తర్వాత 4వ స్థానంలో 805 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్‌ను దించే అవకాశం ఉంది. వన్డే ఫార్మాట్‌లో రోహిత్ శర్మకు జోడీగా ఇషాన్ పేరు ప్రతిపాదించారు.
ముగ్గురికీ ఓపెనింగ్ అనుభవం..
శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ.. ముగ్గురు ఓపెనర్లుగా అనుభవం ఉంది. వీరిలో కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇద్దరిని ఎంచుకోవాలి. రోహిత్ శర్మ తన స్థానాన్ని నిలుపుకునే అవకాశం ఉంది. అయితే ద్రావిడ్ విభిన్న కలయికలను పరీక్షిస్తున్నాడు. విరాట్ కోహ్లిని అతడి స్థానంలోనే దింపి.. రోహిత్ శర్మ 4వ స్థానంలో ఆడిస్తే గిల్, ఇషాన్ ఓపెనింగ్ జోడీగా పంపాలనుకుంటున్నారు. అయితే కొంతమంది సూచనల తర్వాత సీనియర్, జూనియర్ కాంబినేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రోహిత్, ఇషాన్ జోడీగా ఫైనల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.