Jawan Trailer: బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండియా ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ షారుక్ ఖాన్ జవాన్ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది.తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, సౌత్ సూపర్ స్టార్ నయనతార నటించిన జవాన్ మూవీ ని తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించారు. అందుకే ఈ సినిమాపై అన్ని భాషల ప్రేక్షకులకు పంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో ఈరోజు రాత్రికి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విడుదల చేసిన జవాన్ ట్రైలర్ ప్రస్తుతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
‘అనగనగా ఒక రాజు ఒకదాని తర్వాత ఒకటి యుద్ధం బోరిపోతూనే ఉన్నారు.. దాహంతో ఆకలితో అడవిలో తిరుగుతున్నాడు.. అతను చాలా కోపంగా ఉన్నారు ‘అనే వాయిస్ ఓవర్ తో షారుక్ఖాన్ని పవర్ఫుల్గా ఈ ట్రైలర్ మనకు ఇంట్రడ్యూస్ చేసింది. ఇక ఆ తర్వాత తండ్రి పాత్ర షారుఖ్ ఖాన్ సీన్స్ కొడుకు పాత్ర షారుక్ ఖాన్ సీన్స్ తో ట్రైలర్ యాక్షన్ థ్రిల్లర్ గా సాగింది. ముఖ్యంగా వెపన్స్ డీలర్ గా విజయ్ సేతుపతి ఇంట్రడ్యూస్ అయిన దగ్గర నుంచి ట్రైలర్ వేరే లెవెల్ కి వెళ్ళింది. మై నేజ్ ఈజ్ కాళీ..నా ప్రాణం కంటే ఎక్కువగా నిర్మించుకొన్న సామ్రాజ్యం మీద చేయి వేస్తే..అంటూ విజయ్ సేతుపతి తన మార్కు విలనిజాన్ని చూపించాడు.
మేము జవాన్లం.. మా ప్రాణాలను ఒక్కసారి కాదు.. వేయిసార్లైన త్యాగం చేస్తాం దేశం కోసం.. కానీ మీలాంటి వాళ్లు తమ లాభాల కోసం ఆశిస్తే.. మా ప్రాణాలను త్యాగం చేయం.. అంటూ షారుక్ చెప్పిన డైలాగ్స్ షారుక్ క్యారెక్టర్‌లోని హీరోయిజాన్ని, ఎమోషన్స్ చూపించాయి.
ఇక నయనతార, ప్రియమణి, దీపికా పడుకొనే ఈ ట్రైలర్ ని మరో లెవల్ కి తీసుకెళ్లారు. ఇక ఫైనల్ గా కొడుకు పై కాదు వారి బాబు పై చేయి వేసి చూడు.. అనే మాస్ డైలాగ్ తో ట్రైలర్ డైరెక్టర్
మొత్తానికి జవాన్ మూవీ ఫ్యాన్స్ కి పండగలా పోతుంది అని ఈ ట్రైలర్తో చెప్పకనే చెప్పారు ఈ సినిమా యూనిట్.