India vs Pakistan : గిల్, రోహిత్ సూపర్ గా ఆడటానికి ఇదే కారణమా.? రోహిత్ వేసిన ప్లాన్ ఫలించిందా..?

అయితే రోహిత్ శర్మ, గిల్ ఇద్దరు కూడా ముందే పవర్ ప్లే లో వికెట్ ఇవ్వకూడదు అని ఫిక్స్ అయిపోయి ఆడినట్టు గా తెలుస్తుంది అందులో భాగంగానే ఇద్దరు కూడా చాలా నిధానంగా వికెట్ కాపాడుతూ మరి స్కోర్ ని చేస్తూ మ్యాచ్ ని ముందుకు తీసుకెళ్లారు

Written By: NARESH, Updated On : September 10, 2023 9:09 pm
Follow us on

India vs Pakistan : ఏషియా కప్ సూపర్ 4 లో భాగం గా ఈరోజు ఇండియా పాకిస్థాన్ టీమ్ లా మధ్య జరగాల్సిన మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బౌలింగ్ తీసుకుంది దాంతో ఇండియా మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది.అయితే మొదట బ్యాటింగ్ కి దిగిన ఇండియన్ ఓపెనర్లు అయిన రోహిత్ శర్మ, శుభమాన్ గిల్ ఇద్దరు కూడా మంచి ఫిట్నెస్ తో గ్రౌండ్ లోకి అడుగు పెట్టారు అయితే రోహిత్ శర్మ మొదట స్ట్రైక్ లోకి వచ్చారు.ఇక పాకిస్థాన్ పేస్ బౌలర్ అయిన షాహిన్ అఫ్రిది మొదటి ఓవర్ వేశాడు అయితే మొదట షాహిన్ అఫ్రిది బాల్స్ చాలా వేగం గా దూసుకు రావడంతో రోహిత్ మొదటి ఐదు బంతులని చాలా ఓపిగ్గా డిపెండ్ చేస్తూ ఆడుతూ వచ్చాడు కానీ చివరి బంతికి మాత్రం బాల్ ని బౌండరీ దాటించాడు.అది చూసిన వాళ్ళందరికీ అది సిక్స్ పడిందా లేక ఫోర్ పోయిందా అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే కలిగింది కానీ ఎంపైర్ దానిని సిక్స్ గా ప్రకటించాడు…ఇక సెకండ్ ఓవర్ లో నసీం షా బౌలింగ్ లో గిల్ ఒక షాట్ ఆడుతుంటే అది బ్యాట్ ఎడ్జ్ కి తగిలి బౌండరీ లైన్ లో చాలా సేపు గాలిలోనే ఉంది అప్పటికే దానిని క్యాచ్ పడుదాం అని పరుగెత్తుకు వచ్చిన షాహిన్ అఫ్రిది కి ఆ క్యాచ్ దొరకలేదు…

ఇక ఇది ఇలా ఉంటే నసీం షా కొద్దిసేపు తన బాల్స్ తో రోహిత్ శర్మ ని ఇబ్బంది పెట్టాడు అది మాములు ఇబ్బంది కాదు బ్యాట్ బాల్ ను టచ్ అవ్వకముందే అది స్వింగ్ అవుతుంది ఒకసారి అయితే బాల్ బ్యాట్ ని తగిలిందేమో అని కెప్టెన్ బాబర్ అజమ్ రివ్యూ కూడా తీసుకున్నాడు కానీ అది బ్యాట్ కి తగలలేదు…అలా కొంతవరకు రోహిత్ ఇబ్బంది పడ్డాడు అది గమనించిన గిల్ ఎక్కువ స్ట్రైక్ తనే తీసుకోవడానికి ట్రై చేశాడు…అందులో భాగంగానే అఫ్రిది వేసిన తర్వాత ఓవర్ లో గిల్ మూడు ఫోర్లు కొట్టాడు.ఎక్కా కూడా పాకిస్థాన్ బౌలర్ లకి భయపడకుండా దైర్యం గా ఆడుతూ వచ్చారు ఇక కొద్దిసేపటికే ఇద్దరు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు…

అయితే రోహిత్ శర్మ, గిల్ ఇద్దరు కూడా ముందే పవర్ ప్లే లో వికెట్ ఇవ్వకూడదు అని ఫిక్స్ అయిపోయి ఆడినట్టు గా తెలుస్తుంది అందులో భాగంగానే ఇద్దరు కూడా చాలా నిధానంగా వికెట్ కాపాడుతూ మరి స్కోర్ ని చేస్తూ మ్యాచ్ ని ముందుకు తీసుకెళ్లారు అయితే 49 బంతుల్లో 6 ఫోర్లు, నాలుగు సిక్స్ లు కొట్టి 56 పరుగులు చేసిన రోహిత్ శర్మ శాదబ్ ఖాన్ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ అవడం జరిగింది.ఆయన ఔట్ అయినప్పుడు ఇండియా స్కోర్ 16 ఓవర్ నాలుగు బంతులకి 121 గా ఉంది..ఇక ఓపెనర్లు ఇద్దరు కలిసి ఇండియా టీమ్ కి ఒక మంచి భాగస్వామ్యం ఇవ్వడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి..ఇక ఆయన ఔట్ అయిన తర్వాత ఓవర్ లోనే 52 బంతుల్లో 10 ఫోర్లు కొట్టి 58 రన్స్ చేసిన గిల్ కూడా షాహిన్ అఫ్రిది బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు…గిల్ ఔట్ అయ్యేసరికి ఇండియా స్కోర్ రెండు వికెట్ల నష్టానికి 123 పరుగులుగా ఉంది…

అయితే వీళ్లిద్దరూ ఇలా ఆడటానికి కారణం మాత్రం రోహిత్ వేసిన ప్లాన్ అనే చెప్పాలి.అదేంటంటే పవర్ ప్లే లో వాళ్ల బౌలింగ్ ని ఎదుర్కొని మనం 100 ప్లస్ స్కోర్ చేయగలిగితే పాకిస్థాన్ బౌలర్ మీద ప్రేజర్ పెరుగుతుంది. ఇక మిగిలిన మ్యాచ్ ని మన ప్లేయర్లు నడిపిస్తారు అని కెప్టెన్ గా ఆయన వేసిన ప్లాన్ 100 % వర్క్ అవుట్ అయిందనే చెప్పాలి…