https://oktelugu.com/

Team India : టీమిండియాను శాపం వెంటాడుతోందా? ప్రతి ఏడాది నవంబర్లో ఎందుకిలా జరుగుతోంది?

ఈ ఏడాది జనవరి నెలలో ఇంగ్లాండ్ జట్టుతో స్వదేశం వేదికగా టెస్ట్ సిరీస్ జరిగింది. ఆ సిరీస్ లో తొలి మ్యాచ్ భారత్ ఓడిపోయింది. ఆ తర్వాత వరుసగా గెలిచింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 5, 2024 / 10:11 PM IST
    Follow us on

    Team India : ఇంగ్లాండ్ మాత్రమే కాదు బంగ్లాదేశ్ పై కూడా భారత్ 2-0 తేడాతో టెస్ట్ సిరీస్ దక్కించుకుంది. అంతకుముందు జరిగిన టి20 వరల్డ్ కప్ లో వరుస విజయాలు సాధించింది. ఏకంగా ట్రోఫీని దక్కించుకుంది. ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ పరిస్థితుల మధ్య టీమిండియా విజయం సాధించింది.. అనంతరం జింబాబ్వే లో పర్యటించి.. అక్కడ కూడా ట్రోఫీని దక్కించుకుంది. ఆ తర్వాత శ్రీలంకపై t20 సిరీస్ లోనూ విజయం సాధించింది. వన్డే సిరీస్ లో మాత్రం ఓటమిపాలైంది. అనంతరం స్వదేశం వేదికగా బంగ్లాదేశ్ పై టీ20 సిరీస్ వైట్ వాష్ చేసింది. ఇదే ఊపు న్యూజిలాండ్ పై చూపిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే అందరి అంచనాలకు భిన్నంగా న్యూజిలాండ్ జట్టు భారత్ ను నేలకు దించింది. పుష్కర కాలం తర్వాత టీమిండియా కు సిరీస్ ఓటమిని చూపించింది. 2000 సంవత్సరం తర్వాత వైట్ వాష్ కు గురిచేసింది. ఈ ఓటమి నేపథ్యంలో టీమిండియా లో లోపాలు బయటపడ్డాయి. జట్టుకూర్పులో చోటు చేసుకున్న తప్పులు వెలుగు చూశాయి. ఇదే క్రమంలో టీమిండియా ఓటమి పట్ల సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. అందులో ఒకటి కాస్త రిలేటెడ్ గా ఉంది.

    నవంబర్ శాపం..

    గతంలో జరిగిన పరిణామాలను, ఇటీవలి న్యూజిలాండ్ జట్టుతో ఎదురైన ఓటమిని కాస్త పరిశీలిస్తే.. టీమిండియాను నవంబర్ శాపం వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. నెటిజన్లు కూడా ఇదే విషయాన్ని పదేపదే పోస్ట్ చేస్తున్నారు. ప్రతి ఏడాది నవంబర్ నెలలో జరిగే కీలక మ్యాచ్ లలో భారత్ ఓడిపోవడం పరిపాటిగా మారింది. మూడు సంవత్సరాల క్రితం అంటే 2021లో టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోయింది. అది క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా టీమిండి అభిమానులకు జీర్ణం కాలేదు. 2022లో నవంబర్ లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టి20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దారుణంగా ఓడిపోయింది. ఇక 2023 నవంబర్లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. సరిగా ఏడాది తిరగకముందే 2024 నవంబర్లో స్వదేశం వేదికగా జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను న్యూజిలాండ్ చేతిలో భారత్ కోల్పోయింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్ తొలిసారిగా వైట్ వాష్ (మూడు టెస్టులు) కు గురైంది..

    అందువల్ల టీమిండియా కు నవంబర్ నెల అంటేనే కలిసి రావడంలేదని అభిమానులు వాపోతున్నారు..” గత మూడు సంవత్సరాలుగా టీమిండియా నవంబర్ నెలలో ఆడిన మేజర్ టోర్నీలలో ఓడిపోయింది. ఇందులో రెండు టీ20 వరల్డ్ కప్ లు ఉన్నాయి. ఒకటేమో వన్డే వరల్డ్ కప్ ఉంది. ఇంకోటేమో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ ఉంది. ఈ ఓటములు టీమిండియా స్థాయిని దిగజార్చాయి. జట్టు ఇప్పటికైనా ఆట తీరును మార్చుకోవాలి. కూర్పు విషయంలో వైవిధ్యాన్ని ప్రదర్శించాలి. అప్పుడే విజయాల బాటపడుతుంది. నవంబర్ ఫోబియా ను జయిస్తుందని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.