https://oktelugu.com/

Brain : డైలీ ఇలా చేస్తే.. మెదడు పనితీరు మెరుగుపడటం గ్యారెంటీ?

ఒక్క నిమిషం కళ్లు మూసుకున్న కూడా మీకు ఏవేవో ఆలోచనలు, ఒత్తిడిగా అనిపిస్తుంది. మైండ్‌ను రిఫ్రెష్ చేసుకోవాలంటే తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. ఈ రోజుల్లో చాలా మంది మొబైల్‌కి ఎక్కువగా బానిస అయ్యి.. మైండ్ పనితీరును కోల్పోతున్నారు. అసలు మైండ్ పనితీరు మెరుగుపడాలంటే ఏం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 5, 2024 4:08 pm
    Brain Exercise

    Brain Exercise

    Follow us on

    Brain :  ఈ రోజుల్లో చాలామంది శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలతో కూడా ఇబ్బంది పడుతున్నారు. జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి, ఆందోళన, మద్యం, ధూమపానం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల చాలా మంది మానసికంగా చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా సంతోషంగా ఉండాలి. మానసికంగా ఆవేదనకు గురైతే సరిగ్గా ఆలోచించలేరు. ముఖ్యంగా మైండ్ ఆలోచించే విధానం పూర్తిగా మారిపోతుంది. కొందరు అయితే అసలు ఏ విషయాన్ని కూడా పూర్తిగా ఆలోచించలేరు. మానసికంగా ఆవేదన చెందుతున్నట్లయితే పూర్తిగా మైండ్ డెడ్ అయిపోతుంది. ఎక్కువగా ఏ విషయం గురించి అయిన ఆలోచించడం, ఒత్తిడికి లోనవడం, డిప్రెషన్‌లోకి వెళ్లడం వల్ల మైండ్ ఎప్పుడూ డిస్టర్బ్‌గా ఉంటుంది. ఒక్క నిమిషం కళ్లు మూసుకున్న కూడా మీకు ఏవేవో ఆలోచనలు, ఒత్తిడిగా అనిపిస్తుంది. మైండ్‌ను రిఫ్రెష్ చేసుకోవాలంటే తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. ఈ రోజుల్లో చాలా మంది మొబైల్‌కి ఎక్కువగా బానిస అయ్యి.. మైండ్ పనితీరును కోల్పోతున్నారు. అసలు మైండ్ పనితీరు మెరుగుపడాలంటే ఏం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    మైండ్ పనితీరు మెరుగుపడాలంటే మొదట చేయాల్సిన పని వ్యాయామం. రోజూ వ్యాయామం చేయడం వల్ల మైండ్ చాలా షార్ప్‌గా ఉంటుంది. ఆలోచన విధానం, ఒత్తిడికి లోనవకుండా ఉండటం, ఏ విషయాన్ని అయిన కూడా చాకచక్యంగా వ్యవహరించడం వంటివి చేయగలరు. డైలీ వ్యాయామం చేయడం వల్ల బాడీ ఫిట్‌గా ఉండటంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. బాడీకి శారీరక శ్రమ ఉంటేనే మైండ్ బాగా పనిచేస్తుంది. ఈ రోజుల్లో చాలామంది సుఖానికి అలవాటు పడి పూర్తిగా వ్యాయామం చేయరు. కానీ రోజుకి కనీసం పది నిమిషాలు అయిన నడిస్తే మెదడు ఆలోచించే విధానంలో పూర్తిగా మార్పులు వస్తాయి. ఎక్కువగా మొబైల్ చూడటం, సినిమాలు చూడటం వంటివి కాకుండా పుస్తకాలు చదవడం, గేమ్స్ ఆడటం, పజిల్స్ చేయడం వంటివి చేస్తే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. కొందరు ఆలస్యంగా నిద్రపోతుంటారు. ఆలస్యంగా డైలీ నిద్రపోవడం వల్ల మెదడు జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. బాడీకి ఎలా శారీరక శ్రమ అవసరమో.. మెదడుకి కూడా అలానే పదును పెట్టాలి.

    కొంతమంది చిన్న విషయాలకి కూడా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. దీనివల్ల జ్ఞాపకశక్తి పూర్తిగా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ వాకింగ్, జాకింగ్, రన్నింగ్ వంటివి చేస్తూ మెదడుని ఏదో విధంగా పదును పెట్టాలి. అలాగే పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి చేస్తే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. చిన్న విషయాలకి కూడా మెదడుకి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వవద్దు. దీనివల్ల ఆలోచించే శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. ఏ విషయాన్ని కూడా సరిగ్గా ఆలోచించలేరు. ప్రతీ విషయంలో సందేహమే కనిపిస్తుంది. మైండ్ పనితీరు మెరుగుపడాలంటే ఆహారంలో కూడా మార్పులు చేయాలి. మద్యం, ధూమపానం జోలికి అసలు పోవద్దు. అప్పుడు మెదడు షార్ప్‌గా ఉంటుంది.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.