Kalyan Ram: డిసెంబరులోనే బరిలోకి బింబిసారా.. శరవేగంగా షూటింగ్​ పూర్తి!

Kalyan Ram: నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోలుగా తెలుగు తెరకు పరిచయమై.. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన వ్యక్తి నందమూరి కళ్యాణ్​ రామ్​. హిట్లు, ఫ్లాప్​లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ.. కెరీర్​లో దూసుకెళ్లిపోతున్నారు కళ్యాణ్​. కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా.. సరికొత్త కథలున్న చిత్రాలనూ ఎంచుకుని తనలోని నటనకు పదును పెడుతున్నారు. అయితే, పటాస్​ సినిమా తర్వాత పెద్దగా హిట్​ అందుకోలేకపోయారు కళ్యాణ్​. ఇప్పుడు తన కెరీర్​లో ఎప్పుడూ చేయని హిస్టారికల్​ సినిమాతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. […]

Written By: Raghava Rao Gara, Updated On : November 18, 2021 11:25 am
Follow us on

Kalyan Ram: నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోలుగా తెలుగు తెరకు పరిచయమై.. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన వ్యక్తి నందమూరి కళ్యాణ్​ రామ్​. హిట్లు, ఫ్లాప్​లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ.. కెరీర్​లో దూసుకెళ్లిపోతున్నారు కళ్యాణ్​. కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా.. సరికొత్త కథలున్న చిత్రాలనూ ఎంచుకుని తనలోని నటనకు పదును పెడుతున్నారు.

అయితే, పటాస్​ సినిమా తర్వాత పెద్దగా హిట్​ అందుకోలేకపోయారు కళ్యాణ్​. ఇప్పుడు తన కెరీర్​లో ఎప్పుడూ చేయని హిస్టారికల్​ సినిమాతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు బింబిసారా అనే టైటిల్​ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మగధ రాజ్యాధిపతి బింబిసార జీవిత కథ ఆధారంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా, పుణ్యభూమిలో ఓ అటవిక రాజు కథే ఈ సినిమా అంటూ చిత్రబృందం మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో కల్యాణ్ రామ్ సరసన కాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ నటిస్తున్నారు.

కాగా, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్​ శరవేగంగా జరుగుతోందని సమాచారం. ఇప్పటి వరకు మోషన్​ పోస్టర్​ తప్ప ఈ సినిమా నుంచి మరే అప్డేట్​ లేదు. ఈ కథ మొత్తం టైమ్​ ట్రావెల్ చుట్టూ నడుస్తుందని తెలుస్తోంది. త్వరగా షూటింగ్ పూర్తయితే.. డిసెంబరులో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ క్రమంలోనే సన్నాహాలు జరుగుతున్నాయని చిత్రయూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు శ్రీ వశిష్ఠ్​ దర్శకత్వం వహిస్తున్నారు. ఎప్పటి నుంచో సూపర్​ హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్​ రామ్​. ఈ సినిమాతోనైనా హిట్​ కొడతారేమో చూడాలి మరి.