Hardik-Natasa: T20 వరల్డ్ కప్ సాధించిన తరువాత టీమిండియా జట్టు గురువారం సొంతగడ్డపై అడుగుపెట్టింది. వీరికి ముంబై వాసులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తరువాత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అనంతరం ఎవరి ఇళ్లల్లోకి వారు వెళ్లి కుటుంబంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నెట్టింటా షేర్ చేస్తున్నారు. అయితే వీరిలో హార్దిక్ పాండ్యా గురించి ఆసక్తి చర్చ సాగుతోంది. ఆల్ రౌండర్ ఆటగాడు అయిన హార్దిక్ పాండ్యా తన కొడుకుతో సెలబ్రేట్ చేసుకున్న పిక్స్, వీడియోను సోషల్ మీడియాలో ఉంచాడు. ఈ సందర్భంగా ఓ విషయంపై హాట్ హాట్ గా చర్చ సాగుతోంది.
T20 వరల్డ్ కప్ గెలవడంలో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో మూడు ఓవర్లలో కేవలం 20 పరుగులు ఇచ్చి.. ముఖ్యమైన వికెట్లు తీశాడు. టోర్నీ మొత్తంగా 144 రన్స్ చేశాడు. 11 వికెట్లు తీసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ లో చివరి ఓవర్ లో తన బౌలింగ్ తో పరుగుల కట్టడి చేశాడు. దీంతో టీ 20 ఆల్ రౌండర్ జాబితాలో టాప్ లో నిలిచాడు. అయితే హార్దిక్ పాండ్యా తన కొడుకు ఆగస్త్యతో సెలబ్రేషన్ చేసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఈ సందర్భంగా ఆయన ‘నేను నీకోసం ఏమైనా చేస్తా.. నా నెంబర్ వన్ నీవే.. ’ అనే క్యాప్షన్ పెట్టాడు. అయితే సోషల్ మీడియాలో ఓ ఆసక్తి చర్చ సాగుతోంది. ఈ ఫొటోలు, వీడియోల్లో నటాషా ఎక్కడా కనిపించడం లేదు. గత కొంత కాలంగా వీరు దూరంగా ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి. నటాషా తన సోషల్ మీడియా ఖాతాలో హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఫొటోలను తీసేసింది. దీంతో వీరు విడిపోయారన్న చర్చ సాగింది. కానీ ఈ వార్తలపై హార్దిక్ పాండ్యా స్పందించలేదు.
అయితే లేటేస్టుగా ఆమె హార్దిక్ తో కనిపించకపోవడంతో వీరు నిజంగానే విడిపోయారన్న వార్తలకు బలం చేకూరుతోంది. ఒకవేళ వీరు దూరంగా లేకపోతే ఇంతటి సెలబ్రేషన్స్ లో నటాషా ఉండే అవకాశం ఉందంటున్నారు. ఆమె లేకపోవడంతో ఇక వీరు దూరమైనట్లేనన్న చర్చ సాగుతోంది. ఇక కొందరు హార్దిక్ పాండ్యా అభిమానులు ‘ఇలాంటి భార్య ఎవరికీ ఉండదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరోక్షంగా హార్దిక్ ను ఓదారుస్తున్నారు.