https://oktelugu.com/

Deepika Padukone: దీపిక కి పుట్టబోయేది మగ బిడ్డా? ఆడ బిడ్డా ? జ్యోతిష్యం చెప్పిన ప్రముఖ పండితుడు…

Deepika Padukone: ఇక ప్రస్తుతం ఆమె ప్రెగ్నెన్సీ తో ఉన్న విషయం కూడా మనకు తెలిసిందే... ఇక ఇలాంటి సమయంలోనే ప్రముఖ జ్యోతిష్యుడు అయిన 'పండిట్ జగన్నాథ్' దీపిక పదుకొనే కు పుట్టబోయేది మగ బిడ్డ? ఆడబిడ్డ?

Written By:
  • Gopi
  • , Updated On : July 6, 2024 / 10:41 AM IST

    Deepika Padukone Pregnancy

    Follow us on

    Deepika Padukone: బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటి దీపికా పదుకొనే.. షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన ‘ఓం శాంతి ఓం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈవిడ మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ ని అందుకుంది. ఇక ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో నటించి టాప్ హీరోయిన్ గా కూడా ఎదిగింది. ఇక ఆమె గత కొన్ని సంవత్సరాల క్రితం నటుడు రన్వీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

    ఇక ప్రస్తుతం ఆమె ప్రెగ్నెన్సీ తో ఉన్న విషయం కూడా మనకు తెలిసిందే… ఇక ఇలాంటి సమయంలోనే ప్రముఖ జ్యోతిష్యుడు అయిన ‘పండిట్ జగన్నాథ్’ దీపిక పదుకొనే కు పుట్టబోయేది మగ బిడ్డ? ఆడబిడ్డ? అనే విషయం మీద తన జ్యోతిష్యాన్ని తెలియజేశాడు. ఇక ఆయన రన్వీర్ సింగ్ దీపికా పదుకొనే జాతకం ప్రకారం వాళ్లకి పండంటి మగ బిడ్డ పుట్టబోతున్నాడు అంటు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

    ఇక రన్వీర్ సింగ్ దీపికా పదుకొనే లా జాతకం ప్రకారం వాళ్లకు ఒక యువరాజు ఇంట్లో కి రాబోతున్నట్టుగా చెప్పాడు. అలాగే ఫ్యూచర్ లో వాళ్ళిద్దరిని ఆ అబ్బాయి చాలా బాగా చూసుకోబోతున్నట్టుగా కూడా చెబుతూ అతని భవిష్యత్తు ని కూడా తెలియజేయడం విశేషం. అయితే దీపిక పండంటి మగ బిడ్డకు జన్మనిస్తుందని ఆయన చెప్పిన మాటలతో కొంతమంది ఏకీభవిస్తుంటే, మరి కొంత మంది మాత్రం కడుపులో ఉన్న బిడ్డని జ్యోతిష్యం ద్వారా ఎలా చెబుతారు అంటూ నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు.

    ఇక మొత్తానికైతే దీపిక పదుకొనే అభిమానులు మాత్రం తమ అభిమాన హీరోయిన్ కి మగ బిడ్డ పుట్టబోతున్నాడు అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ లో దీపిక పదుకొనే తల్లి కాబోతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇదిలా ఉంటే దీపిక రీసెంట్ గా కల్కి సినిమాతో ఒక భారీ సక్సెస్ ని అందుకున్న విషయం మనకు తెలిసిందే…