Irfan Pathan: ఆసియా కప్ లో పాకిస్తాన్ ప్లేయర్లకు పిచ్చి లేసినట్టుంది. ఒక్కో మ్యాచ్లో ఒక్కో తీరుగా ప్రవర్తిస్తున్నారు. భిన్న విధాలుగా హావభావాలను ప్రదర్శిస్తూ పరువు తీసుకుంటున్నారు. ఇటీవల ఇండియాతో జరిగిన మ్యాచ్లో అనవసరంగా గిల్, అభిషేక్ శర్మతో గొడవపడ్డారు. అంతేకాదు రఫెల్ యుద్ధ విమానాలను కూల్చివేశామంటూ సంకేతాలు కూడా ఇచ్చారు. పాకిస్తాన్ పురుష జట్టు మాత్రమే కాదు.. మహిళల జట్టు కూడా ఇదేవిధంగా వ్యవహరించింది. సౌత్ ఆఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ మహిళా క్రికెటర్లు 6-0 అనే విధంగా సంకేతాలు ఇచ్చారు.
ఈ వివాదాలను మర్చిపోకముందే.. పాకిస్తాన్ క్రికెటర్లు శ్రీలంకతో జరుగుతున్న సూపర్ ఫోర్ మ్యాచ్లో ఓవరాక్షన్ చేశారు. ముఖ్యంగా అబ్రార్ అహ్మద్ తన స్థాయికి మించిన ప్రదర్శన చేశాడు. తీసింది ఒక వికెట్ అయినప్పటికీ.. ప్రపంచ కప్ గెలిచినంత బిల్డప్ ఇచ్చాడు. నాలుగు ఓవర్లు వేసిన అతడు.. 8 పరుగులు ఇచ్చి. ఒక వికెట్ తీశాడు. అంతేకాదు శ్రీలంకలో అత్యంత ప్రమాదకరమైన హసరంగ వికెట్ పడగొట్టాడు. వికెట్ తీసిన ఆనందంలో రెండు చేతులతో చిత్రమైన సంకేతాలు ఇచ్చాడు. హసరంగ పెవిలియన్ వెళ్తుంటే చిత్రంగా చూశాడు.
అబ్రార్ అహ్మద్ చిత్రమైన సంకేతాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసాయి. గతంలో పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హసరంగ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఆ సమయంలో అతడు కూడా చిత్రమైన హావభావాలు ప్రదర్శించాడు. అతని అవుట్ చేసి.. అతడు గతంలో చేసిన మాదిరిగానే అబ్రార్ అహ్మద్ ప్రస్తుతం చేశాడు. ఇప్పుడు అవుట్ చేసి రివెంజ్ తీర్చుకున్నాడు. అయితే అబ్రార్ అహ్మద్ వ్యవహార శైలి పట్ల టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ మండిపడ్డాడు. అతడు కాపీ క్యాట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటువంటి వ్యక్తులు మైదానంలో ఉండకూడదని.. అతడిని త్వరగా బయటికి పంపించాలని పేర్కొన్నాడు.
ఇప్పుడు మాత్రమే కాదు గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పుడు అబ్రార్ అహ్మద్ బౌలింగ్లో గిల్ అవుట్ అయ్యాడు. అప్పుడు రెండు చేతులు కట్టుకొని.. పెవిలియన్ వెళ్ళిపో అన్నట్టుగా గిల్ కు దారి చూపాడు అహ్మద్.. అప్పటినుంచి అతని మీద టీం ఇండియా అభిమానులు విపరీతమైన ఆగ్రహం పెంచుకున్నారు. ఇక ఇప్పుడు శ్రీలంక ఆటగాడిని అవుట్ చేసి చిత్రమైన సంకేతాలు ఇవ్వడంతో.. సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇటువంటి వ్యక్తులు పాకిస్తాన్ జట్టులో మాత్రమే ఉంటారని మండిపడుతున్నారు.
Irfan Pathan calls out the copycat Abrar Ahmed #IrfanPathan #AbrarAhmed #SLvPAK #T20 #AsiaCup2025 #Insidesport #CricketTwitter pic.twitter.com/1SlSx6tTEF
— InsideSport (@InsideSportIND) September 23, 2025