TANA Kuchipudi Dance Exams: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (ఎస్‌పిఎంవివి) అనుబంధ సంస్థ అయిన తానా కళాశాల ఆధ్వర్యంలో అమెరికా చార్లెట్ నగరంలో కూచిపూడి ప్రాక్టికల్ పరీక్షలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ సంగీత, నృత్య విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డా. ఉప్పరి హిమబిందు (ఎం.పి.ఎ., ఎం.ఫిల్., పి.హెచ్.డి.) ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసి పరీక్షలను పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమాన్ని చార్లెట్ తానా బృందం నాయకులు నాని వడ్లమూడి, కిరణ్ కొత్తపల్లి, టాగూర్ మల్లినేని, మాధురి ఏలూరి, నాగ పంచుమర్తి సమన్వయం చేశారు. డా. హిమబిందు గారికి, ఉపాధ్యాయురాలు ఝాన్సీ గారికి ఘనసత్కారం నిర్వహించారు. పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

తానా, ఎస్‌పిఎంవివి భాగస్వామ్యంతో డాన్స్, మ్యూజిక్‌లో ఉన్నత స్థాయి డిప్లొమా కోర్సులు అందుబాటులోకి రావడం ఒక ముఖ్య మైలురాయిగా నిలిచింది. దీని వల్ల స్థానిక కళాకారులు తమ ప్రతిభను మరింత మెరుగుపరుచుకునే అవకాశం లభిస్తోంది.

ఈ కార్యక్రమంపై తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, వైస్ ప్రెసిడెంట్ శ్రీని లావు, కళాశాల నిర్వాహకులు మాలతి నాగభైరవ తదితరులు పాల్గొన్న విద్యార్థులను అభినందిస్తూ, తానా చేపడుతున్న సాంస్కృతిక, విద్యా కార్యక్రమాలు ఇండియా-అమెరికా సంబంధాలను మరింత బలపరుస్తున్నాయని పేర్కొన్నారు.

తానా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కూచిపూడి ప్రాక్టికల్ పరీక్షలు అమెరికాలో తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టే ఒక అద్భుత వేదికగా నిలిచాయి.

