IPL 2023 : ఐపీఎల్ 16 ఎడిషన్ శుక్రవారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మొదలైంది. టాస్ గెలిచిన చెన్నై జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.. రుత్ రాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే చెన్నై ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే ఆదిలోనే చెన్నైని మహమ్మద్ షమీ చావు దెబ్బతీశాడు.
మ్యాచ్ లో 2.2 ఓవర్ల వద్ద చెన్నై జట్టు స్కోరు 14 పరుగులుగా ఉన్నప్పుడు.. ముంబై జట్టు బౌలర్ మహమ్మద్ షమీ నిప్పులు చెరిగే బంతికి కాన్వే వికెట్ గింగిరాలు తిరిగింది. బంతి గిరాటేయడంతో థర్డ్ వికెట్ అమాంతం లేచి ఎగిరిపోయింది. కీపర్ దగ్గర పడింది. దీంతో బిత్తర పోయిన కాన్వే నిరాశతో పెవిలియన్ చేరుకున్నాడు. కాన్వే మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న చెన్నై కెప్టెన్ ధోని.. ఒక్కసారిగా అసంతృప్తి గురయ్యాడు.
కాన్వే ఔట్ అయిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మొయిన్ అలీ 23 పరుగులు చేసి సౌకర్యవంతంగా కనిపించినప్పటికీ.. ఇతడిని రషీద్ ఖాన్ అవుట్ చేశాడు. అప్పటికి చెన్నై జట్టు స్కోర్ 5.5 ఓవర్ల వద్ద 50 పరుగులు. మొయిన్ అలీ వికెట్ తీయడంతో రషీద్ ఖాన్ ను గుజరాత్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా అమాంతం ఎత్తుకున్నాడు..
ఇక చెన్నై జట్టు స్కోర్ అంతంత మాత్రం గా ఉండడంతో.. మరో ఓపెనర్ గైక్వాడ్ ఆఫ్ సెంచరీ తో చెల రేగిపోయాడు. ఐపీఎల్ 16వ సీజన్లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 30 బంతుల్లో మూడు ఫోర్లు, 7 సిక్స్ లతో దూకుడు ఆట తీరు ప్రదర్శించాడు. ఈ కథనం రాసే సమయానికి అతడు 63 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం చెన్నై 11.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.
A cracking delivery to get his 1⃣0⃣0⃣th IPL wicket 🔥🔥@MdShami11 picks the first wicket of #TATAIPL 2023!
Follow the match ▶️ https://t.co/61QLtsnj3J#GTvCSK pic.twitter.com/hN0qgJ2rFo
— IndianPremierLeague (@IPL) March 31, 2023