https://oktelugu.com/

IPL: వదిలేసుకున్న ప్లేయర్లను ప్రాంచైజీలు చేజ్కించుకుంటాయా?

IPL 2022: వచ్చే ఏడాదిలో ఐపీఎల్-2022 మహాసంగ్రామం జరగనుంది. కొత్తగా లక్నో, అహ్మదాబాద్ ప్రాంచైజీ జట్లు బరిలో నిలువడంతో ఆటగాళ్ల మెగా వేలం పాటలు షూరు కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను బీసీసీఐ ఇప్పటికే చేసేసింది. ప్రాంచైజీలు కీలకమైన ఆటగాళ్లను అంటిపెట్టుకునే ప్రక్రియ కూడా పూర్తయింది. మొత్తంగా 32మందిని అంటిపెట్టుకునే అవకాశం ఉండగా ప్రాంచైజీలు మాత్రం 27మందిని మాత్రం ఉంచుకున్నాయి. ముంబాయి, చైన్నె, ఢిల్లీ, కొలకత్తా జట్లు నలుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా బెంగళూరు, రాజస్థాన్ జట్లు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 7, 2021 / 03:13 PM IST
    Follow us on

    IPL 2022: వచ్చే ఏడాదిలో ఐపీఎల్-2022 మహాసంగ్రామం జరగనుంది. కొత్తగా లక్నో, అహ్మదాబాద్ ప్రాంచైజీ జట్లు బరిలో నిలువడంతో ఆటగాళ్ల మెగా వేలం పాటలు షూరు కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను బీసీసీఐ ఇప్పటికే చేసేసింది. ప్రాంచైజీలు కీలకమైన ఆటగాళ్లను అంటిపెట్టుకునే ప్రక్రియ కూడా పూర్తయింది. మొత్తంగా 32మందిని అంటిపెట్టుకునే అవకాశం ఉండగా ప్రాంచైజీలు మాత్రం 27మందిని మాత్రం ఉంచుకున్నాయి.

    IPL 2022

    ముంబాయి, చైన్నె, ఢిల్లీ, కొలకత్తా జట్లు నలుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా బెంగళూరు, రాజస్థాన్ జట్లు ముగ్గురిని, పంజాబ్ ఇద్దరి చొప్పున అంటిపెట్టుకున్నాయి. సన్ రైజర్స్ మాత్రం కీలక ప్లేయర్స్ ను వదులుకున్నట్లు కన్పిస్తోంది. అనేక ఈక్వేషన్స్ మధ్య జట్లు కీ ప్లేయర్స్ ను వదులుకోవడంతో ప్రాంచైజీలు తిరిగి తమ ఆటగాళ్లను కొనుగోలు చేస్తాయా? లేదా అనేది ఆసక్తి రేపుతోంది.

    ముంబై జట్టులో రోహిత్ శర్మ, బుమ్రా, సూర్యకుమార్, పోలార్డ్ ఉన్నారు. హర్దిక్ ప్యాండ్య వెన్నునొప్పితో బాధపడుతుండగా కృనాల్ సరైన ప్రదర్శన చేయడం లేదు. దీంతో వీరిని ఆజట్టు రిటైన్ చేసుకోలేదు. ఇషాన్ కిషన్, ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ నీషమ్, రాహుల్, డికాక్ లను తిరిగి వేలంలో దక్కించుకోవాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం చూస్తోంది.

    చెన్నైలో కీలక ఆటగాళ్లు ఎంఎస్. ధోని, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నారు. డుప్లెసిన్, రైనా, రాయుడు, ఉతప్పలను తిరిగి దక్కించుకోవాలని భావిస్తోంది. డ్వేన్ బ్రావో ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో అతడి ఐపీఎల్ ఆడుతాడో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. సీనియర్లతోపాటు జూనియర్లకు కూడా సీఎస్కే భావిస్తే మాత్రం వేలంపాట రసవత్తరంగా మారడం ఖాయంగా కన్పిస్తోంది.

    ఢిల్లీలో పంత్, అక్షర్ పటేల్, పృథ్వీ షా, నార్జ్ లు ఉన్నారు. సీనియర్ ఆటగాళ్లు శిఖర్ ధావన్, అశ్విన్ లను జట్టు వదులుకుంది. దీంతో ఈ హిట్ పెయిర్ ను ఢిల్లీ యాజమాన్యం తిరిగి దక్కించుకుంటుందో లేదో అన్నది ఆసక్తికరంగా మారింది.

    కోలకతాలో రసెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్, నరైన్ లను ఆయా ప్రాంచైజీలు తమతో అంటిపెట్టుకున్నాయి. ఓపెనర్ శుభ్ మన్ గిల్, ఇయాన్ మెర్గాన్, దినేష్ కార్తిక్, షకీల్ అల్ హసన్ వంటి కీలక ఆటగాళ్లను కేకేఆర్ వదులుకుంది. వీరిని వేలంలో దక్కించుకునే అవకాశం ఉంది.

    బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ, మాక్స్ వెల్, సిరాజ్ మాత్రమే జట్టులో ఉన్నారు. ఓపెనర్ దేవదుత్ పడిక్కల్, స్పిన్నర్ యుజేంద్ర చాహెల్ లను తిరిగి దక్కించుకునే అవకాశం ఉంది. ఈ జట్టులో అందరూ టాప్ ప్లేయర్స్ ఉన్నా కీలక సమయంలో తడబడుతూ ఉంటుంది. దీంతో ఈసారి యాజమాన్యం తాము వదులుకున్న ప్లేయర్స్ దక్కించుకోవడం కష్టంగా కన్పిస్తోంది.

    సన్ రైజర్స్ లో విలియమ్స్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్ ఉన్నారు. యాజమాన్యంతో గొడవల కారణంగా డేవిడ్ వార్నర్, వేరే ప్రాంచేజీతో చర్చలు జరపడంతో రషీద్ ఖాన్ ను జట్టు వదులుకున్నట్లు తెలుస్తోంది. మిడిఆర్డర్ బ్యాట్స్ మెన్ తోపాటు కొత్త ఆటగాళ్ల కోసం సన్ రైజర్స్ వేలపాటల్లో పోటీ పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

    Also Read: న్యూజిలాండ్ పై టీంఇండియా ‘అదిరిపోయే’ రికార్డులు..!

    రాజస్థాన్లో సంజు శాంసన్, బట్లర్, యశస్విలను అంటిపెట్టుకుంది. ఈ జట్టులో టాప్ ప్లేయర్స్ విజయాలు దక్కకపోవడంతో యాజమాన్యం కొత్త ఆటగాళ్లను తీసుకునేందుకే మొగ్గుచూపుతోంది.

    పంజాబ్ జట్టులో మయాంక్, అర్ష్ దీప్ మాత్రమే ఉన్నారు. షమీ, దీపక్ హుడా, పూరన్, షారూఖ్ ఖాన్, మురగన్ అశ్విన్, రిచర్డ్ సన్ లను వేలంలో దక్కించుకునే అవకాశం కన్పిస్తుంది. కేఎల్. రాహుల్ వేలంపాటకు వెళ్లేందుకు మొగ్గుచూపడటంతో అతడిని తిరిగి పంజాబ్ దక్కించుకుంటుందో లేదో అనేది సస్పెన్స్ గా మారింది.

    Also Read: టీమిండియా విజయాల బాట పట్టిందా?