https://oktelugu.com/

ఆమెను వెలి వేద్దాం.. బ్రదర్ ఏమి చెబితే అదే మా మాట !

NTR and ANR: తెలుగు సినిమా రంగం అప్పుడప్పుడే బుడిబుడి అడుగులు వేస్తూ ఎదుగుతున్న క్షణాలు అవి. కానీ, కొన్ని తప్పటడుగులు పడుతున్నాయని గుసగుసలు మొదలయ్యాయి. నిజానికి సినిమా రంగం మొదటి నుంచి క్రమశిక్షణగా లేదు. తొలితరం సూపర్ స్టార్ నాగయ్యగారి జీవితమే అందుకే ఉదాహరణ. అలాంటి వ్యసనాల మయంలో సినిమా రంగం పడిపోకుండా కాపాడుకోవాలని మొదట గళమెత్తింది ఎన్టీఆరే. ఎన్టీఆర్ కి తోడుగా ఏఎన్నార్‌ కూడా నిలిచారు. ఏఎన్నార్ పెద్దగా చదువుకోలేదు. ఆయనకు ఎన్టీఆర్ గారిని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 7, 2021 / 03:14 PM IST
    Follow us on

    NTR and ANR: తెలుగు సినిమా రంగం అప్పుడప్పుడే బుడిబుడి అడుగులు వేస్తూ ఎదుగుతున్న క్షణాలు అవి. కానీ, కొన్ని తప్పటడుగులు పడుతున్నాయని గుసగుసలు మొదలయ్యాయి. నిజానికి సినిమా రంగం మొదటి నుంచి క్రమశిక్షణగా లేదు. తొలితరం సూపర్ స్టార్ నాగయ్యగారి జీవితమే అందుకే ఉదాహరణ. అలాంటి వ్యసనాల మయంలో సినిమా రంగం పడిపోకుండా కాపాడుకోవాలని మొదట గళమెత్తింది ఎన్టీఆరే.

    NTR ANR Jamuna

    ఎన్టీఆర్ కి తోడుగా ఏఎన్నార్‌ కూడా నిలిచారు. ఏఎన్నార్ పెద్దగా చదువుకోలేదు. ఆయనకు ఎన్టీఆర్ గారిని చూసిన తర్వాతే చదువు పై క్రమశిక్షణ పై ఆసక్తి కలిగింది. అలా ఓ రోజు నాగేశ్వరరావుగారు, ఎన్టీఆర్ గారు నిర్మాతలతో ఓ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్ గురించి అప్పటి పత్రికల కథనాల ప్రకారం ఎన్టీఆర్ ఓ హీరోయిన్ పై సీరియస్ అయ్యారట.

    ఆమె ప్రవర్తన సరిగ్గా లేదని, మార్చుకోవాలని ఎన్టీఆర్ ఆమెకు సూచించారు. అయితే, ఏఎన్నార్ మాత్రం ఆమెను కొన్నేళ్లు పాటు వేలేద్దాం, అప్పుడే ఆమె దారికి వస్తుంది అని ప్రపోజల్ పెట్టారు. అలా ఆ మీటింగ్ లోనే జమునను వారిద్దరూ తమ సినిమాల్లో పెట్టుకోకుండా ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ బాగు పడాలంటే.. మనం రూల్స్ పెట్టుకోవాలి’ అని ఎన్టీఆర్ అన్నారు.

    ఆ మాటకు నిర్మాతలంతా తమ బాధను తెలుపుతూ.. తెలుగు చిత్రాలకు లిమిటెడ్ మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే కదా. తెలుగు చిత్రాలకు తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక లాంటి ఇతర రాష్ట్రాల్లో.. ఇతర భాషల్లో మార్కెట్ లేదు. కాబట్టి పారితోషికాల విషయంలోనూ ఓ మాట అనుకుంటే బాగుంటుందని నిర్మాత నాగిరెడ్డి గారు సూచించారు. ‘బ్రదర్ ఏమి చెబితే మా మాట అదే’ అంటూ ఏఎన్నార్, ఎన్టీఆర్ వైపు చూశారు.

    Also Read: Samantha: చచ్చిపోతానేమో అనుకున్నా.. చైతన్య విడాకులపై సమంత సంచలన వ్యాఖ్యలు

    ‘మన పక్క రాష్ట్రాల్లోనే కాదు, మన చిత్రాలకు నార్త్ ఇండియాలోనూ మార్కెట్ లేదు బ్రదర్. ఇక ఫారిన్ మార్కెట్ గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు. కావున, నిర్మాతలకు సమస్య ఉన్న మాట నిజం. ఎలాగూ మన ఇద్దరం ఓ మాట మీద నిలబడితే.. మిగిలిన హీరోలంతా ఓ పద్దతి ప్రకారం వెళ్తారు. అందుకే, పారితోషికం విషయంలో మనం ఒక లిమిట్ పెట్టుకుందాం’ అని చెప్పుకుంటూ పోతున్నారు ఎన్టీఆర్.

    ఓ పక్క లిమిట్ అంటే.. ఎంత చెబుతారో అని నిర్మాతలలో టెన్షన్ మొదలైంది. డెభై వేలు ఖాయం చేస్తే బాగుంటుంది అని కొంతమంది నిర్మాతలు ఆశ పడుతున్నారు. మనం సినిమాకు 50వేల రూపాయలు మాత్రం పారితోషికంగా పుచ్చుకుంటున్నాం బ్రదర్’ అని ఎన్టీఆర్ మాట వినబడింది. నిర్మాతలంతా ఒక్కసారిగా పైకి లేచి ఎన్టీఆర్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నారు. నిర్మాతల బాగు కోసం ఎన్టీఆర్ గారు ఆ రోజుల్లో అంత గొప్పగా ఆలోచించేవారు.

    Also Read: Kondapolam: అమెజాన్​లో ‘కొండపొలం’ స్ట్రీమింగ్​.. చూసేయండి మరి

    Tags