https://oktelugu.com/

Kondapolam: అమెజాన్​లో ‘కొండపొలం’ స్ట్రీమింగ్​.. చూసేయండి మరి

Kondapolam: వైష్ణవ్​ తేజ్​ హీరోగా, ప్రముఖ దర్శకుడు క్రిష్​ జాగర్లమూడి తెరకెక్కించిన చిత్రం కొండపొలం. యాక్షన్​ థ్రిల్లర్​ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై.. ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఫస్ట్​ఫేమ్​ ఎంటర్​టైన్మెంట్స్​ బ్యానర్​పై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్​ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఇది.రకుల్​ ప్రీత్​సింగ్​ ఈ సినమాలో హీరోయిన్​, సాయి చంద్​, కోటా శ్రీనివాస రావు, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎమ్​ఎమ్​ కీరవాణి సంగీతం అందించారు. కొండపొలం నవల ఆధారంగా ఈ సినిమాను […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 7, 2021 / 03:12 PM IST
    Follow us on

    Kondapolam: వైష్ణవ్​ తేజ్​ హీరోగా, ప్రముఖ దర్శకుడు క్రిష్​ జాగర్లమూడి తెరకెక్కించిన చిత్రం కొండపొలం. యాక్షన్​ థ్రిల్లర్​ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై.. ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఫస్ట్​ఫేమ్​ ఎంటర్​టైన్మెంట్స్​ బ్యానర్​పై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్​ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఇది.రకుల్​ ప్రీత్​సింగ్​ ఈ సినమాలో హీరోయిన్​, సాయి చంద్​, కోటా శ్రీనివాస రావు, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎమ్​ఎమ్​ కీరవాణి సంగీతం అందించారు. కొండపొలం నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.

    తొలి సినిమా ఉప్పెనతోనే బ్లాక్​బాస్టర్ హిట్​ అందుకున్న వైష్ణవ్​ తేజ్​.. ఈ సినిమాతో మంచి క్రేజ్ దక్కించుకున్నారు. దసరా కానుకగా అక్టోబరు 8న విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్​ ప్రైమ్​ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్​ అవుతోంది.

    ఇంజ‌నీరింగ్ చ‌దివిన ఓ యువ‌కుడు ఉద్యోగం సంపాదించుకోవ‌డానికి భ‌య‌ప‌డుతూ… కొండ‌పొలానికి వెళ్లిన‌ప్పుడు మాన‌సికంగా ఎలాంటి ప‌రిణితి చెందాడ‌నేదే ఈ సినిమా క‌థ‌. ఇందులో కటారి రవీంద్ర యాదవ్‌గా వైష్ణవ్‌, ఓబులమ్మగా రకుల్‌ కనిపిస్తారు.ఈ సినిమా షూటింగ్​ను తొలుత గోవా, నల్లమల అడవుల్లో అనుకున్నారు. కానీ, కొన్ని పరిస్థితుల కారణంగా వికారాబాద్​ ఫారెస్ట్​లో తెరకెక్కించారు.  థియేటర్ల లో ఈ సినిమాను చూడలేకపోయిన వారంతా.. ప్రైమ్ వీడియోలో చూసే అవకాశం దొరికినట్లే.  ఇంకెందుకు ఆలస్యం అమెజాన్​కు ట్యూన్​ అయిపోయి మీరు కూడా చూసేయండి కొండపొలం.