Today Horoscope In Telugu (6)
Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉంటాయి. మరి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : వ్యాపారులు కొన్ని కార్యకలాపాల ద్వారా బిజీగా ఉంటారు. పూర్వీకుల ఆర్థిక సంబంధించిన శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులను వాయిదా వేయకుండా ఉండాలి. తల్లిదండ్రుల సలహాతో కొత్త పెట్టుబడులు పెడతారు. విదేశాల్లో ఉండే వారి నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. కొత్తవిత్ర విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలను కొందరు మోసం చేసే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారులో శత్రువుల బెడద నుంచి తప్పించుకుంటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాల గురించి చర్చిస్తారు. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకుని కొత్త పెట్టుబడులు పెడతారు. నైపుణ్యాలను ప్రదర్శించడం వల్ల ఉద్యోగాలు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈరోజు వారికి ఈరోజు అనేక రంగాల నుంచి మద్దతు ఉంటుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. వ్యాపారంపై శ్రద్ధ చూపే ప్రయత్నం చేయాలి. లేకుంటే నష్టాలను ఎదుర్కొంటారు. కొన్ని ఒప్పందాలను వాయిదా వేసుకుంటారు. అయితే ఇలా చేయడం వల్ల నష్టాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మద్దతుతో ఉద్యోగులు ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. దీంతో జీతం పెరిగే అవకాశం ఉంటుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి సమాజంలో గుర్తింపు లభిస్తుంది. మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. సాయంత్రం పాత స్నేహితులను కలవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. ఈరోజు వ్యాపారులకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థుల పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : స్నేహితుల్లో ఒకరి ఆరోగ్యం పై ఆందోళన ఉంటుంది. ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయాలి. కొత్త కోర్సులో చేరే విద్యార్థులకు ఇదే మంచి అవకాశం. పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడానికి ఖర్చులు అవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ఇంట్లో జరిగే కార్యక్రమం గురించి చర్చిస్తారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విదేశాల్లో ఉండే వారి నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పదోన్నతి పొందే అవకాశం. కుటుంబ సభ్యులంతా కలిసి విహారయాత్రలకు వెళ్తారు. పాత స్నేహితులను కలవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. అనుకోకుండా ఆదాయం పెరిగి లాభాలు వస్తాయి. దీంతో ఉల్లాసంగా ఉంటారు. పూర్వీకుల ఆర్థిక సంబంధించి శుభవార్తలు వింటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోతారు. అదనపు ఆదాయం పొందేవారు ఆర్థిక పురోగతికి సంబంధించి శుభవార్తలు వింటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు నెలకొనే అవకాశం ఉంటుంది. మాటలను అదుపులో ఉంచుకోకపోతే తీవ్ర నష్టం జరుగుతుంది. స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగానే. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. వీటిని తగ్గించుకోకపోతే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో పెట్టుబడి కోసం వ్యాపారులు ప్రణాళికలు వేస్తారు. డబ్బు కొరత కారణంగా వ్యాపారులు ఆందోళన చెందుతారు. మానసికంగా ఇబ్బందులు ఏర్పడడంతో అనారోగ్యానికి గురవుతారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : సమాజంలో పనిచేసేవారు గుర్తింపును పొందుతారు. ఇంట్లో జరిగే శుభ కార్యక్రమాల గురించి శుభవార్తలు వింటారు. ఎవరితోనైనా వాదన పెట్టుకుంటే మౌనంగా ఉండాలి. లేకుంటే తీవ్ర నష్టం జరుగుతుంది. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. వ్యాపారులు విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో ఆందోళన ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వ్యాపారులు వేరుతో అప్పుడే ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈరోజు ఈ రాశి వారు నిరాశపరిచే వార్తలు వింటారు. అది కలవర పెడుతుంది. విద్యార్థులు ఉపాధ్యాయుల నుంచి మద్దతు పొందుతారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. సోదరీ సోదరుల వివాహంలో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. విద్యా రంగంలో ఉన్నవారు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. పిల్లల కెరీర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ఆత్మతో ముందుకు వెళ్తారు. అనేక రంగాలకు చెందినవారు ప్రయోజనాలు పొందుతారు. ఏ పని చేసిన ఏకాగ్రతతో చేయాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటారు. ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. సామాజిక రంగంలో పనిచేసిన వారికి ఇబ్బందులు ఉంటాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . మీ రాశి వ్యాపారాలు ఏదైనా రిస్కు తీసుకుంటే అది ఫలితాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆలోచనత్మకంగా నిర్ణయం తీసుకోవాలి. ఇంట్లో జరిగే కార్యక్రమాల గురించి చర్చిస్తారు. ఉద్యోగులు వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారులు మాటలను అదుపులో ఉంచుకోవాలి.