Duvvada Srinivas : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు( duvvada Srinivas ) డాక్టరేట్ వరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్ లో అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సలహాదారుడు మార్క్ బర్న్ చేతుల మీదుగా డాక్టరేట్ అందించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ట్విట్టర్లో ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డే స్ప్రింగ్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ద్వారా దువ్వాడ శ్రీనివాస్ తన వృత్తి పట్ల అంకితభావం, సమాజంలో విశిష్ట సేవలను గుర్తిస్తూ డాక్టరేట్ ను ప్రధానం చేసినట్టు ఆ పోస్టులో రాసి ఉంది. ప్రస్తుతం ఇది వైరల్ అంశంగా మారింది.
Also Read : కేసీఆర్ మాట : పొత్తు లేకుంటే చంద్రబాబు గెలిచేవాడు కాదా?
* వ్యవహారం వివాదాస్పదం..
గత కొద్ది రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. గత ఐదేళ్లపాటు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో దూకుడుగా వ్యవహరించారు దువ్వాడ శ్రీనివాస్. ఈ ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలితో విభేదించారు ఆయన భార్య వాణి. ఈ క్రమంలో దివ్వెల మాధురితో సాన్నిహిత్యం పెంచుకున్నారు. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో అలజడి రేగింది. కొద్దిరోజుల పాటు వివాదం నడిచింది. చివరకు సద్దుమణగడంతో మాధురి తో కొనసాగుతున్నారు దువ్వాడ శ్రీనివాస్.
* అరెస్ట్ అంటూ ప్రచారం..
ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ అరెస్టు జరుగుతుందని అంతా ప్రచారం నడిచింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ( deputy CM Pawan Kalyan)అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై ఫిర్యాదులు చేశారు జనసేన నేతలు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ జరుగుతుందని అంతా భావించారు. అయితే ఇంతలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంట వస్త్ర వ్యాపారంలోకి అడుగు పెట్టింది. వకులా శారీస్ పేరిట హైదరాబాదులో భారీ షోరూం ప్రారంభించింది ఈ జంట. రాజకీయాల కంటే వ్యాపారం పైనే ఎక్కువగా దృష్టి పెడతారని ప్రచారం జరుగుతూ వస్తోంది.
* వృత్తిలో రాణించినందుకు
అయితే ఓ అమెరికన్ యూనివర్సిటీ( American University) ఇప్పుడు గౌరవ డాక్టరేట్ దువ్వాడ శ్రీనివాస్ కు ప్రదానం చేయడం విశేషం. పైగా ఆయన ఉన్న వృత్తిలో రాణించినందుకు.. అంకిత భావంతో పని చేసినందుకు డాక్టరేట్ అందించినట్లు చెబుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ హర్ష కుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అశోక్ గౌడ్, రాజయ్య గౌడ్ తో పాటు దివ్వెల మాధురి కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.
Also Read : ఏకమైన దక్షిణాది రాష్ట్రాలు.. ఏకీభవించిన చంద్రబాబు.. వైసిపి తటస్థం!
*దువ్వాడ కు డాక్టరేట్ బిరుదు ప్రదానం*
ఈ రోజు హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్ లో
*YCP MLC దువ్వాడ. శ్రీనివాస్ కు అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సలహాదారుడు MR. MARK BURN (మార్క్ బర్న్ ) చేతుల మీదుగా (DAYSPRING INTERNATIONAL UNIVERSITY) డే స్ప్రింగ్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం… pic.twitter.com/eEunPXcsoP
— JAGANANNAMEDIA (@JAGANANNAMEDIA) March 21, 2025