ఓ వైపు ప్రపంచం మొత్తం కరోనా విజృంభిస్తుంటే అసలు క్రికెట్ మ్యాచ్‌లేంటి అని అందరూ అనుకున్నారు. ఒకవిధంగా మ్యాచ్‌లు జరుగుతాయా లేదా అనే సందేహం అందరిలోనూ కనిపించింది. ఎట్టకేలకు ప్రారంభమైన ఐపీఎల్ 2020 సక్సెస్ ఫుల్‌గా కొనసాగింది. ఇప్పుడు తుది దశకు చేరింది.
Also Read: దెబ్బకు ప్లేఆఫ్స్ కు.. డూ ఆర్ డై మ్యాచ్‌లో సన్‘రైజ్’
ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌తో 56 మ్యాచ్‌ల లీగ్ దశ పూర్తయింది. ఈ మ్యాచ్‌లో 10 వికెట్లతో గెలిచిన హైదరాబాద్.. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. సగర్వంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. అంతకుముందు పాయింట్ల పట్టికలో ముంబయి టాపర్‌గా, సెకండ్ ప్లేస్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, నాలుగో స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉండిపోయాయి. ఇకపై ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు జరుగబోతున్నాయి. ఇక ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లన్నీ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
క్వాలిఫయర్-1: టాప్-2 ప్లేస్‌ల్లో నిలిచిన టీమ్స్ మధ్య ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2లో మళ్లీ ఆడే అవకాశం ఉంటుంది. టేబుల్ టాపర్ ముంబై ఇండియన్స్ సెకండ్ ప్లేస్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో నవంబర్5న దుబాయ్ వేదికగా అమీతుమీ తేల్చుకోనుంది.
ఎలిమినేటర్: పాయింట్స్ పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు.. టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఓడిన టీమ్ క్వాలిఫయర్-2 ఆడుతుంది. మూడో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. నాలుగో స్థానంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరును నవంబర్ 6 అబుదాబి వేదికగా ఢీకొట్టబోతోంది.
Also Read: రానా, కోహ్లీ, ప్రకాష్ రాజ్ కు షాక్.. హైకోర్టు నోటీసులు
క్వాలిఫయర్ 2: క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ నవంబర్ 8 అబుదాబి వేదికగా జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌కు వెళ్తుంది.
ఫైనల్: క్వాలిఫయర్ 1, 2లో గెలిచిన జట్ల మధ్య ఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్ నవంబర్ 10 దుబాయ్ వేదికగా జరగుతుంది.