ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బుధవారం హైకోర్టుకు తెలిపారు. ఇప్పడున్న పరిస్థితుల్లో ఎన్నికలు వాయిదా వేయడం సాధ్యం కాదని హైకోర్టుకు ఆయన నివేదిక సమర్పించారు. బీహార్, తదితర ప్రదేశాల్లో నిర్వహించిన ఎన్నికలు కరోనా నిబంధనలతో ప్రశాంతంగా జరగిాయని ఇక్కడ కూడా అలాగే నిర్వహించవచ్చని అన్నారు. అయితే ఇంతకుముందు ఏపీలో ఎన్నికలు నిర్వహిస్తే హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటాయని రాజకీయ పార్టీలు కోరాయన్నారు. కానీ ఇప్పడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. అయితే ఈసారి ఎన్నికలు సాఫీగా జరగాలంటే ప్రఫభుత్వ సహకారం తప్పినిసరిగా ఉండాలన్నారు.