https://oktelugu.com/

బీహార్‌‌ ఎన్నికలు: మోడీ వరాలు.. అక్కడి ప్రజలు నమ్మేనా..!

బీహార్‌‌ పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే రెండో విడత ఎన్నికలు కూడా ముగియగా.. మరికొద్ది రోజుల్లో మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఈసారి బీహార్‌‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ పాలు పంచుకున్నారు. ఎన్డీయే తరఫున నితీష్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలంటూ కోరుతున్నారు. నితీష్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే.. గట్టిగానే హామీలు ఇస్తున్నారు. సరిహద్దుల్లో బీహార్‌‌ సైనికులు చేస్తున్న కృషిని కూడా కొనియాడుతూ లోకల్‌ సెంటిమెంట్‌ను గుర్తుచేస్తున్నారు. మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 4, 2020 / 10:50 AM IST
    Follow us on

    బీహార్‌‌ పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే రెండో విడత ఎన్నికలు కూడా ముగియగా.. మరికొద్ది రోజుల్లో మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఈసారి బీహార్‌‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ పాలు పంచుకున్నారు. ఎన్డీయే తరఫున నితీష్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలంటూ కోరుతున్నారు. నితీష్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే.. గట్టిగానే హామీలు ఇస్తున్నారు. సరిహద్దుల్లో బీహార్‌‌ సైనికులు చేస్తున్న కృషిని కూడా కొనియాడుతూ లోకల్‌ సెంటిమెంట్‌ను గుర్తుచేస్తున్నారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలే వారు బీహారీలు కదా మరి మోడీ మాటలను ఎంత వరకు విశ్వసిస్తారనేది తెలియకుండా ఉంది. 2015 ఎన్నికల్లోనూ బీహార్‌‌లో మోడీ ప్రచారం చేశారు. బీజేపీని గెలిపిస్తే లక్షల కోట్ల నిధులను మంజూరు చేస్తానని చెప్పారు. అయితే అప్పట్లో మోడీ మాటలను విశ్వసించని బీహార్ ప్రజలు మహాగడ్బంధన్‌కే పట్టం కట్టారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

    Also Read: అమెరికా ఎన్నికల ఫలితాలు తీవ్ర ఆలస్యం?

    సర్వేల లెక్కలు ఎప్పుడు ఎలా మారిపోతాయో ఎవరం ఊహించలేం. గత ఎన్నికల్లోనూ సర్వేలు బీజేపీ వైపే మొగ్గుచూపాయి. బీహార్‌‌లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని ముందస్తు సర్వేలు తెలిపాయి. కానీ.. తీరా ఎన్నికల ఫలితాలు మాత్రం మహాగడ్బంధన్‌కు అనుకూలంగా వచ్చాయి. ఈసారి కూడా ముందస్తు సర్వేలు ఎన్డీయే కూటమికే మద్దతుగా వెల్లడవుతున్నాయి. ప్రధానంగా కరోనా వైరస్ సమయంలో ఉపాధి లేక సామాన్య ప్రజలు అల్లాడిపోతుంటే కేంద్ర, రాష‌్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. మోదీపై వ్యతిరేకత బీహార్‌‌లో పెరగడానికి కూడా ఇది ఒక కారణంగా చెబుతున్నారు.

    Also Read: దుబ్బాకలో బీజేపీ వేవ్.. గెలిచేస్తోందా?

    మరోవైపు.. నితీష్‌ కుమార్‌‌కు మద్దతిస్తే ఆయన మోడీ చంకలో చేరిపోయారని బీహారీలు గుర్రుగా ఉన్నారట. నితీష్‌ నిజాయతీపరుడైన నాయకుడే అయినప్పటికీ తాము ఇచ్చిన తీర్పును కాదని బీజేపీతో కలసి నడవటాన్ని చాలావరకు తప్పు పడుతున్నారు. మోదీ మాత్రం తన ప్రచారంలో బీహార్‌‌పై వరాల జల్లు కురిపిస్తున్నారు. అయితే.. మోడీ హామీలను ప్రజలు కూడా లైట్‌ తీసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్‌. చివరగా.. అంతటి చరిష్మా కలిగిన నితీష్‌ కూడా మోడీ ప్రచారంపైనే ఆధారపడుతుండడం కూడా ఆయనకు మైనస్‌ అయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి.