IPL new rules 2026: ఐపీఎల్ (IPL) జోరుగా సాగుతోంది. ఆటగాళ్లు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నారు. జట్లు పోటాపోటీగా పరుగులు తీస్తున్నాయి. 200+ టార్గెట్ కూడా చిన్నగా మారిపోతుంది. ఆ టార్గెట్ ఫినిష్ చేయడానికి జట్లు చివరి వరకు పోరాడుతున్నాయి. ఈ సీజన్ ఐపీఎల్ లో ప్రారంభ మ్యాచ్ బెంగళూరు, హైదరాబాద్ మధ్య జరిగింది. హైదరాబాద్ ఏకంగా 200+ స్కోర్ చేసింది. ఆ టార్గెట్ ఫినిష్ చేయడానికి బెంగళూరు రంగంలోకి దిగి.. వేగంగా ఆడింది. ఓవర్లు పూర్తికాకముందే లక్ష్యాన్ని పూర్తి చేసి సంచలనం సృష్టించింది.
ఐపీఎల్ లో ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో.. చూసేవాళ్ళకు అసలు సిసలైన క్రికెట్ మజా లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వాహక కమిటీ ఒక కొత్త నిబంధనను తెరపైకి తీసుకువచ్చింది. దాని ప్రకారం ఇకపై టీం షీట్ లో ఉన్న 16 మంది ప్లేయర్లకు మాత్రమే గ్రౌండ్లో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. మిగతా ప్లేయర్లకు ఆ అవకాశం ఉండదు. అంతేకాదు ఆ ప్లేయర్లు డ్రింక్స్, బ్యాట్లు, వర్తమానాలు తీసుకురాకూడదని స్పష్టం చేసింది. బౌండరీ చుట్టూ ఐదుగురు కంటే ఎక్కువ బెంచ్ ప్లేయర్లు ఉండకూడదని స్పష్టం చేసింది. ఎల్ఈడీ యాడ్ బోర్డులు.. బౌండరీ లైన్ మధ్య ప్లేయర్లు తిరగడానికి అవకాశం లేదని ఐపీఎల్ నిర్వాహక కమిటీ స్పష్టం చేసింది.
ఈ నిబంధన పట్ల కొంతమంది ప్లేయర్లు పెదవి విరుస్తున్నారు. టి20 అనేది స్వల్ప కాలంలో పూర్తయ్యే ఫార్మాట్ అని.. అలాంటప్పుడు ఆటగాళ్లు మైదానంలోకి వస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల పోటీ హోరా హోరీగా సాగుతుందని.. ఆటగాళ్లు మరింత ఉత్సాహంతో ఆడేందుకు ఆస్కారం ఏర్పడుతుందని ప్లేయర్లు చెబుతున్నారు.
ఇటీవల కాలంలో ప్లేయర్లు కొంతమంది మైదానంలోకి రావడం.. డ్రింక్స్, బ్యాట్లు అందిస్తున్నామని సాకుతో వర్తమానాలను తీసుకురావడం పరిపాటిగా మారిపోయింది. దీనివల్ల క్రీడా స్ఫూర్తి పూర్తిగా దెబ్బతింటున్నదని ఐపీఎల్ నిర్వాహక కమిటీ భావించింది. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల ఇకపై 16 మంది ప్లేయర్లు మాత్రమే గ్రౌండ్లోకి ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది. మిగతా ప్లేయర్లు కేవలం రిజర్వ్ బెంచ్ కు మాత్రమే పరిమితమవుతారు. అంతేకాదు వాళ్లు కేవలం మ్యాచ్ మాత్రమే చూసేందుకు అవకాశం పొందుతారు. బయటనుంచి సంకేతాలు.. ఇతరత్రా ఈ విషయాలను ఆటగాళ్లకు చెప్పడానికి అవకాశం ఉండదు. ఒకవేళ ఈ నిబంధన ఎవరైనా ప్లేయర్లు అతిక్రమిస్తే తదుపరి చర్యలు తీవ్రంగా ఉంటాయని ఐపిఎల్ నిర్వాహక కమిటీ ఇప్పటికే స్పష్టం చేసింది.