IPL 2025
IPL 2025 : సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్‌లో ఆడుతున్న విధ్వంసక బ్యాటింగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రతి మ్యాచ్‌లోనూ 250లకు పైగా పరుగులు చేయడం అసాధారణమని అందరికీ తెలుసు. అయితే, గత రెండు మ్యాచ్‌లలో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమి పాలవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ తీవ్రమైన ట్రోలింగ్‌కు గురవుతోంది. ప్రతి మ్యాచ్‌లోనూ 300 పరుగులు చేస్తామని చెప్పినట్టుగా ఇంతలా విఫలమయ్యారని నెటిజన్స్ విమర్శిస్తున్నారు.
Also Read : ఆంధ్ర ప్రదేశ్ కి కొత్త IPL టీం..? సన్ రైజర్స్ హైదరాబాద్ ఇక ఉండదా?
వాస్తవానికి, ఏ జట్టు అయినా టోర్నమెంట్‌లో కొన్ని మ్యాచ్‌లు ఓడిపోవడం సహజం. కానీ సన్ రైజర్స్ విషయంలో, జట్టు ప్రయాణాలు, సోషల్ మీడియాలో వ్యతిరేక కథనాలు ఊపందుకున్నాయి. టోర్నమెంట్ ప్రారంభంలో చూపించిన ఉత్సాహాన్ని కొనసాగించలేకపోతున్నారని, భారీ స్కోర్లు చేయలేకపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. SRH 300 పరుగులు చేయలేదని ట్రోల్ చేయడం కూడా ఆ జట్టు సృష్టించిన ఇంపాక్ట్‌కు నిదర్శనం. వారి అటాకింగ్ క్రికెట్ బ్రాండ్‌తో లీగ్‌లో ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో ఇది తెలియజేస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికీ లీగ్‌లోని అత్యంత ఎంటర్ టైన్ మెంట్ జట్లలో ఒకటిగా గర్వంగా చెప్పుకోవచ్చు. గత కొన్నేళ్లుగా వారు అందిస్తున్న ఎంటర్ టైన్ మెంట్ ఎప్పటికీ మరచిపోలేనిది. కొన్ని మ్యాచ్‌లు ఓడిపోయినంత మాత్రాన వారిని ట్రోల్ చేయడం సబబు కాదు. మరో పవర్-ప్యాక్డ్ ప్రదర్శన వస్తే ఈ ట్రోలింగ్ ఆగిపోతుంది.
ప్రస్తుతం హైదరాబాద్ ఎదుర్కొంటున్న అసలైన సవాల్ ఏమిటంటే, హైదరాబాద్ స్టేడియం వెలుపల కూడా ఇదే స్థిరమైన, అటాకింగ్ క్రికెట్‌ను ఆడడం. ఇది జట్టు విజయావకాశాలను నిర్దేశించనుంది. సొంత గడ్డపై చెలరేగినట్టుగా ఇతర వేదికలపైనా రాణిస్తే SRH మళ్లీ తన సత్తా చాటుతుంది.
Also Read : CSK, MI పని అయిపోయినట్టేనా..