Shreyas Iyer Records : అస్తవ్యస్తంగా ఉన్న జట్టును అయ్యర్ ఒకదారికి తెచ్చాడు. బిగినింగ్ నుంచి పెండింగ్ వరకు జట్టును సరైన దారిలో నడిపాడు. ఏమాత్రం అవక తవకలకు అవకాశం లేకుండా వెళ్లే ప్రయత్నం చేశాడు. అంతేకాదు ప్రీతి జింటా జట్టును ఏకంగా టేబుల్ టాపర్ గా నిలిపాడు. పంజాబ్ జట్టు మొదటి స్థానంలో నిలవడం ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి. అంతేకాదు ఫైనల్ దాకా వెళ్లడం.. కప్ మీద ఆశలు కల్పించడంలో కూడా అయ్యర్ విజయవంతమయ్యాడు. అందువల్లే అతడిని పంజాబ్ అభిమానులు వెయ్యి నోళ్ల పొగుడుతున్నారు. వాస్తవానికి పంజాబ్ జట్టు ఇక్కడదాకా రావడానికి అయ్యర్ చాలా కష్టపడ్డాడు. మైదానంలో సుదీర్ఘంగా కసరత్తు చేశాడు. కోచ్ పాంటింగ్, పంజాబ్ జట్టు యాజమాన్యంతో నిత్యం మంతనాలు జరిపాడు. అందువల్లే పంజాబ్ జట్టు ఈ స్థాయి దాకా వచ్చింది. పంజాబ్ జట్టు కంటే ముందు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు అయ్యర్ నాయకత్వం వహించాడు. ఆ తర్వాత అతని క్రీడా జీవితం అనేక మలుపులు తిరిగింది. బిసిసిఐ సెంట్రల్ కాంట్రాక్టులో అతడికి స్థానం లభించలేదు. దీంతో అతడు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.. దేశవాళి క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చి తన సత్తా ఏమిటో చూపించాడు.
ముంబై జట్టుతో కలిసి తన రంజి ప్రయాణాన్ని సాగించాడు. అందులో రంజి ట్రోఫీ గెలిచేలా చేశాడు..కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు నాయకుడిగా ఐపీఎల్ ట్రోఫీ అందుకున్నాడు. దేశవాళీ క్రికెట్ టోర్నీలో ముంబై జట్టుతో కలిసి ఇరానీ కప్ అందుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ముంబై జట్టులో ఆడి.. ఆ జట్టును విజేతగా నిలిపాడు. ఇక ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాలో చోటు సంపాదించుకొని.. తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి అదరగొట్టాడు. ఇక ప్రస్తుత ఐపిఎల్ లో తనమీద ఎన్నో అంచనాలను పెట్టుకున్న ప్రీతిజింటాను ఆకాశం అంత ఎత్తున నిలిపాడు. చరిత్రలో తొలిసారిగా పంజాబ్ జట్టులో ట్రోఫీ గెలుస్తామనే భరోసా నింపాడు.. యువి, సంగక్కర, గిల్ క్రిస్ట్ వంటి క్రీడాకారుల వల్ల కానిది.. సారధిగా అతడు పంజాబ్ జట్టుకు ట్రోఫీ గెలిచే అవకాశాన్ని ఒక్క అడుగు దూరంలో ఉంచాడు. ఇటీవల హార్దిక్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఏమాత్రం భయం అనేది లేకుండా దుమ్ము రేపాడు. సిక్సర్ల వర్షం కురిపించి మైదానాన్ని హోరెత్తించాడు. ఫైనల్ మ్యాచ్లో కూడా అతడు అదే విధంగా బ్యాటింగ్ చేయాలని.. తమ జట్టను గెలిపించాలని.. ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలని పంజాబ్ అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read : స్నేహితురాలితో చిల్ అవుతున్న శిఖర్ ధావన్! ఫోటోలు వైరల్