IPL Controversial Moments: ఐపీఎల్ అనగానే పరుగుల వరద గుర్తుకొస్తూ ఉంటుంది. బౌలర్లు పడే ఇబ్బంది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. బ్యాటర్లు అదేపనిగా బంతిని పడుతూ ఉంటే మజా వస్తుంది. కానీ తినగా తినగా మొహం మొత్తినట్టు.. అలాగే పరుగులు కొడుతూ ఉంటే చూసే వాళ్లకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే బ్యాట్, బంతిమధ్య సమరం సమానంగా జరిగినప్పుడే క్రికెట్ మజా ఉంటుంది. అలాకాకుండా బ్యాట్ మాత్రమే ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. ప్రస్తుత ఐపిఎల్ లో కొన్ని మ్యాచ్లు మినహా.. మిగతా అన్నింట్లోనూ బ్యాట్ దే అప్పర్ హ్యాండ్ కొనసాగుతోంది.
ఈ ఐపీఎల్లో బ్యాటర్లు సంచలనాల సృష్టిస్తున్నారు. భీకరమైన బ్యాటింగ్ స్టైల్ తో అదరగొడుతున్నారు. 200కు పైగా పరుగులను అత్యంత సులభంగా ఫినిష్ చేస్తున్నారు. 2008 నుంచి 2025 వరకు జట్లు ఐదుసార్లు 220+ స్కోర్ లను చేదిస్తే.. ఈ ఒక్క సీజన్లోనే ఐదుసార్లు ఆ ఘనతను జట్లు నమోదు చేశాయి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 265 పరుగుల టార్గెట్ ను కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఫినిష్ చేసింది.. ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 249 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు జస్ట్ నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి చేసేసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 229 పరుగుల టార్గెట్ ను హైదరాబాద్ జట్టు జస్ట్ ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి ఫినిష్ చేసింది. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 228 పరుగుల టార్గెట్ ను రాజస్థాన్ జట్టు నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 220 పరుగుల టార్గెట్ ను అత్యంత సులభంగా పూర్తి చేసింది.
ప్లాట్ మైదానాల మీద బ్యాటర్లు పండగ చేసుకుంటున్నారు. బంతి బ్యాట్ మీదికి రావడంతో వీర విహారం చేస్తున్నారు. ఫలితంగా బౌలర్లు ప్రేక్షకుల మాదిరిగా ఉండిపోతున్నారు. అంతటి బుమ్రా కూడా ఐపిఎల్ లో వికెట్ తీయలేకపోతున్నాడు అంటే.. బ్యాటర్ల ఆధిపత్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బంతిని ఇష్టానుసారంగా కొడుతున్న నేపథ్యంలో బౌలర్లు ఎటువంటి ప్రభావం చూపించలేకపోతున్నారు. కొన్ని మ్యాచ్ లలో మినహా.. మిగతా అన్ని సందర్భాల్లో బౌలర్లు విఫలమవుతున్నారు.
260కి మించి పరుగులు కొట్టినా సరే గెలిచే అవకాశం లేదంటే.. బ్యాటర్ల హవా ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఏమాత్రం భయం అనేది లేకుండా కొంతమంది బ్యాటర్లు ఆడుతున్న తీరు చూస్తే బౌలర్లు బంతిని వేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పంజాబ్, హైదరాబాద్ జట్లలో ఉన్న ఓపెనర్లు ప్రత్యర్థి బౌలర్లకు సింహ స్వప్నం లాగా నిలుస్తున్నారు. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా బ్యాటింగ్ చేస్తున్నారు. ఇందులో రాజస్థాన్ ఓపెనర్లు తక్కువేమీ తినలేదు. వారు కూడా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఇప్పటికే ఈ జట్లలో ప్లేయర్లు పరుగుల వరద పారిస్తూ సరికొత్త రికార్డులు సృష్టించారు. ఆరెంజ్ క్యాప్ విభాగంలో ఈ జట్ల ప్లేయర్లు ముందు వరుసలో ఉండడం విశేషం. హైదరాబాద్ జట్టుకు సంబంధించిన ప్లేయర్లు ఆరెంజ్ క్యాప్ విభాగంలో తొలి ఐదు స్థానాలలో కొనసాగుతూ ఉండడం విశేషం. ఇప్పటికీ ఆరెంజ్ క్యా హోల్డర్ లు గా అనేక పర్యాయాలు హైదరాబాద్ ప్లేయర్లు నిలిచారు.
కేఎల్ రాహుల్ ప్రస్తుతం లీడింగ్ రన్నర్ గా ఉన్నప్పటికీ.. అభిషేక్ శర్మ అతడిని అధిగమించే అవకాశం ఉంది.. ఈ ప్రకారం చూసుకుంటే మిగతా మ్యాచుల్లో ఇంకా భీకరమైన రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది. ఇలా ఏ ప్రకారం చూసుకున్నా సరే ఐపీఎల్ చరిత్రలో ఈసారి సరికొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. 2008 నుంచి 2025 వరకు నమోదు కాని రికార్డులు.. ఇప్పుడే లిఖితమవుతున్నాయి అంటే.. బ్యాటర్ల రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.