ఐపీఎల్‌ వేళానికి వేళాయె..

ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) మినీ వేలానికి టైమ్ ద‌గ్గర ప‌డుతోంది. గురువారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి చెన్నైలో ఈ వేలం ప్రారంభ‌ం కాబోతోంది. ఈ వేలంలో మొత్తం 292 మంది ప్లేయ‌ర్స్ త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు. ఇందులో 164 మంది ఇండియ‌న్ ప్లేయ‌ర్లు కాగా.. 125 మంది విదేశీ ప్లేయ‌ర్లు. మ‌రో ముగ్గురు అసోసియేట్ దేశాల ప్లేయ‌ర్లు ఉన్నారు. అయితే వీళ్ల నుంచి61 మంది ప్లేయ‌ర్స్‌ను మాత్రమే ఫ్రాంచైజీలు తీసుకోనున్నాయి. ఈ వేలం కోసం […]

Written By: Srinivas, Updated On : February 18, 2021 12:29 pm
Follow us on


ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) మినీ వేలానికి టైమ్ ద‌గ్గర ప‌డుతోంది. గురువారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి చెన్నైలో ఈ వేలం ప్రారంభ‌ం కాబోతోంది. ఈ వేలంలో మొత్తం 292 మంది ప్లేయ‌ర్స్ త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు. ఇందులో 164 మంది ఇండియ‌న్ ప్లేయ‌ర్లు కాగా.. 125 మంది విదేశీ ప్లేయ‌ర్లు. మ‌రో ముగ్గురు అసోసియేట్ దేశాల ప్లేయ‌ర్లు ఉన్నారు. అయితే వీళ్ల నుంచి61 మంది ప్లేయ‌ర్స్‌ను మాత్రమే ఫ్రాంచైజీలు తీసుకోనున్నాయి. ఈ వేలం కోసం 1,097 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 814 మంది భారతీయులుగా కాగా, మిగతా 283 మంది విదేశీయులు. ఈ నేప‌థ్యంలో ఏ టీమ్ ద‌గ్గర ఎంత డ‌బ్బు ఉంది? ఏ టీమ్‌కు ఎంత మంది ప్లేయ‌ర్స్ తీసుకునే అవ‌కాశం ఉందో ఒక‌సారి చూద్దాం.

Also Read: ఇంగ్లండ్ తో చివరి రెండు టెస్టులకు భారత జట్టు ఇదే.. మార్పులివే..

ఇప్పటికే చాలా జట్లు తమ ప్రధాన ఆటగాళ్లను రిటెయిన్ ఆప్షన్ ద్వారా అట్టి పెట్టుకున్నాయి. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు మాత్రం చాలా మంది ఆటగాళ్లను వదులుకున్నాయి. ఆ జట్లకు ఈ వేలం కీలకం కానుంది. వేలానికి పేర్లు నమోదు చేసుకున్న ఆటగాళ్లలో 207 మందికి అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. 863 మంది ఫస్ట్ క్లాస్ క్రికెట్, స్థానిక స్థాయిలో ఆడారు. 27 మంది ఐసీసీ అసోసియేట్ సభ్య దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు.

మొత్తం 283 మంది విదేశీ ఆటగాళ్లలో వెస్టిండీస్ వాళ్లు (56 మంది) అత్యధికంగా ఉన్నారు. ఆ తర్వాత అత్యధికంగా విదేశీ ఆటగాళ్లు ఆస్ట్రేలియా (42), దక్షిణాఫ్రికా (38), శ్రీలంక (31), అఫ్గానిస్థాన్ (30), న్యూజీలాండ్ (29), ఇంగ్లాండ్ (21)ల నుంచి ఉన్నారు. యూఏఈ (9), నేపాల్ (8), స్కాట్లాండ్ (7), బంగ్లాదేశ్ (5), జింబాంబ్వే (2), ఐర్లాండ్ (2), నెదర్లాండ్స్ (1) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఐపీఎల్ ఆరంభం నుంచి చాలా ఏళ్ల పాటు రిచర్డ్ మెడ్లీ వేలం పాటను నిర్వహిస్తూ వచ్చారు. ఐపీఎల్ వేలం పాటకు ఆయన పేరు పర్యాయ పదంలా ఉండేది. వివిధ రంగాల్లో వేలం పాటలు నిర్వహించిన అనుభవం కూడా మెడ్లీకి ఉంది. అయితే.. కొన్నేళ్లుగా హ్యూ ఎడ్మిడెస్ ఈ వేలం పాటను నిర్వహిస్తున్నారు. ఫ్రాంచైజీల యజమానులు, వేలానికి హాజరైనవారు, బీసీసీఐ యాజమాన్యంతో సమన్వయం చేసుకోవడం వేలం నిర్వాహకుల బాధ్యత. ప్రతి ఆటగాడికీ కనీస ధర ఉంటుంది. ఒకటికి మించి జట్లు ఆ ఆటగాడిని కొనేందుకు ఆసక్తి చూపితే, వేలం మొదలవుతుంది. ఎక్కువ మొత్తం పాడిన జట్టుకు ఆ ఆటగాడు దక్కుతాడు. ఎవరు ఆసక్తి చూపకపోతే ఆ ఆటగాడు అమ్ముడవ్వకుండానే మిగిలిపోతాడు. ఇలా మిగిలిపోయిన ఆటగాళ్లను చివర్లో మరోసారి వేలం వేస్తారు. వేలంలో ఎవరు అత్యధిక ధర దక్కించుకుంటారన్నది ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది.

Also Read: ఇంగ్లండ్ తో వన్డేలకు జట్టులో కీలక మార్పులు.. వీరు ఇన్.. వారు ఔట్?

కాగా.. ఇప్పటివరకు ఆడిన పలువురు ప్లేయర్లు ఆయా జట్ల నుంచి తప్పుకున్నారు. ముంబయి ఇండియన్స్ జట్టు సభ్యులుగా ఉన్న ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్లు మిచెల్ స్టార్క్, జేమ్స్ పాటిన్సన్ ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇంగ్లాండ్ టెస్టు జట్టు కెప్టెన్ జో రూట్, బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీం కూడా ఈసారి ఐపీఎల్ వేలంలో పేర్లు నమోదు చేసుకోలేదు. ఈసారి వేలానికి వస్తున్న ఆటగాళ్లలో అందరి కన్నా కుర్ర ప్లేయర్ అఫ్గానిస్తాన్‌కు చెందిన నూర్ అహ్మద్ లఖన్వాల్. అతడి వయసు 16 ఏళ్లు. ఇక అందరికన్నా సీనియర్ ఆటగాడు 42 ఏళ్ల నయన్ దోషి.