
పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటి పార్టీ పరువు నిలుపుకోవాలని చూస్తోంది తెలుగుదేశం పార్టీ. ఇందుకు వేయాల్సిన ఎత్తులన్నీ వేస్తోంది. వైసీపీని ఇరకాటంలో పెట్టాలని చూస్తోంది. అయితే… ఇంతవరకు బాగానే ఉన్నా టీడీపీ వేసుకున్న ప్లానింగ్‌కు ఆ ఇద్దరు ఎంపీలు సహకరించడం లేదట. ఎవరి దారిలో వారు ఉన్నారట. ఇప్పటి వరకు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వారు పట్టించుకున్నది లేదు.
Also Read: మహిళా మంత్రుల ఇలాఖాలో ఎదురుగాలి
ప్రస్తుతం టీడీపీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. వీరిలో ఇద్దరు కీలకమైన రెండు జిల్లాల్లో ఉన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. వీరిరువురూ ఇప్పుడు సెంటర్ ఆఫ్ న్యూస్‌గా మారారు. వీరిద్దరికీ కూడా పంచాయతీ ఎన్నికలపై ఆసక్తి లేదనే సంకేతాలు వస్తున్నాయి. నిజానికి వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో పార్టీ మెజారిటీ గ్రామాల్లో ఏకగీవ్రాలు సాధించే అవకాశం ఉంది. కానీ.. ఆ దిశగా కృషి చేయడం లేదని సీనియర్లు మండిపడుతున్నారు.
రాజధాని మార్పు ప్రభావంతో విజయవాడ, గుంటూరు జిల్లాల్లో సాధారణ ప్రజల్లోనూ అధికార పార్టీపై వ్యతిరేకత ఉంది. చివరకు వైసీపీ కార్యకర్తల్లోనూ ఈ ఆవేదన ఉంది. స్థానిక ఎన్నికల్లో అసలు టీడీపీ సత్తా చాటేది ఈ రెండు జిల్లాల్లోనే అన్న విశ్లేషణలు కూడా సాగుతున్నాయి. అలాంటి టైంలో ఈ రెండు జిల్లాల్లో ఉన్న ఈ ఎంపీలు ఇద్దరూ కూడా ఎవరికి వారుగా ఉండడం, ఎవరి వ్యూహాలు వారికి ఉండడంతో పార్టీ పరిస్థితి ఇబ్బందిగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా.. వీరి నుంచి సహకారం లేదని సమాచారం.
Also Read: హత్య కేసు నిందితులు వారే..?: మిస్టరీ ఛేదించిన పోలీసులు
మరీ ముఖ్యంగా విజయవాడ ఎంపీ నాని.. నాకెందుకు వచ్చింది! అనే ధోరణిని ప్రదర్శిస్తున్నారట. అసలు పార్టీ అధినేతకు కూడా ఆయన అందడం లేదు. దీంతో పరిస్థితి దారుణంగా ఉందనే వ్యాఖ్యలు వస్తున్నాయి. తన పార్లమెంటు పరిధిలో కాస్త కష్టపడడంతోపాటు అక్కడ పార్టీ ఇన్‌చార్జీలతో సమన్వయం చేసుకుంటే మంచి ఫలితాలే వస్తాయి. అయినా.. నాని పట్టించుకోవడం లేదని టాక్. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్.. తను చెప్పింది అందరూ వినాలనే ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఆయనకు చంద్రబాబు మిగిలిన వారికంటే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుండడంతో.. మిగిలిన నేతలను మాజీ మంత్రులను కూడా జయదేవ్ పట్టించుకోవడం లేదు. పోనీ.. పంచాయతీ ఎన్నికల్లో అన్నీ తనే అయి వ్యవహరిస్తున్నారా ? అంటే.. అది కూడా లేదు. వీటిని లైట్‌గా తీసుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
Comments are closed.