https://oktelugu.com/

నందీశ్వరుని కొమ్ముల మధ్యలో శివుని దర్శనం చేసుకోవడానికి గల కారణం ఇదే..!

మనం శివాలయానికి వెళ్ళినప్పుడు కచ్చితంగా మనకు శివలింగం ముందు నందీశ్వరుడు కనిపిస్తాడు. ఆలయంలోకి వెళ్ళిన భక్తులు మొదటగా నంది దర్శనం చేసుకున్న తర్వాతే శివుడి దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తూ స్వామివారిని దర్శనం చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అయితే శివాలయానికి వెళ్ళిన భక్తులందరూ నందీశ్వరుని కొమ్ముల మధ్య స్వామివారిని దర్శనం చేసుకోవడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం… Also Read: పెద్ద వారి పాదాలకు నమస్కారం చేయడం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 18, 2021 / 12:36 PM IST
    Follow us on

    మనం శివాలయానికి వెళ్ళినప్పుడు కచ్చితంగా మనకు శివలింగం ముందు నందీశ్వరుడు కనిపిస్తాడు. ఆలయంలోకి వెళ్ళిన భక్తులు మొదటగా నంది దర్శనం చేసుకున్న తర్వాతే శివుడి దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తూ స్వామివారిని దర్శనం చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అయితే శివాలయానికి వెళ్ళిన భక్తులందరూ నందీశ్వరుని కొమ్ముల మధ్య స్వామివారిని దర్శనం చేసుకోవడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

    Also Read: పెద్ద వారి పాదాలకు నమస్కారం చేయడం వెనుక కారణం ఏమిటో తెలుసా?

    నంది కైలాస పర్వతానికి క్షేత్రపాలకుడు, అదేవిధంగా శివుని ప్రమధ గణాలలో నందీశ్వరునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ శివునికి ఎంతో పరమభక్తుడైన నందీశ్వరుని అనుగ్రహం లేనిదే శివుని దర్శనం కుదరదు. ఆ శివుని అనుగ్రహం కలగాలంటే ముందుగా నందీశ్వరుని అనుమతి తప్పనిసరి. నందీశ్వరుడు వేద ధర్మానికి ప్రతీక. నందీశ్వరునికి ఉన్న రెండు కొమ్మలలో ఒకటి త్రిశూలానికి, రెండవది సుదర్శన చక్రానికి ప్రతీకగా చెబుతారు.

    Also Read: జన్మ నామ నక్షత్రం ప్రకారం మీ రాశికి ఆది దేవత ఎవరో తెలుసా?

    ఈ విధంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ నందీశ్వరుని ముందుగా పువ్వులతో నంది పృష్ట భాగాన్ని కుడి చేతితో తాకుతూ, ఎడమ చేతి వేళ్ళను కొమ్మలపై ఉంచి మన తలను నంది మూపురం పై ఉంచి కొమ్మల మధ్యలో నుంచి ఆ పరమేశ్వరుని ఏకాగ్రత దృష్టితో దర్శించుకోవడం వల్ల ఆ నందీశ్వరుడి అనుగ్రహం కలిగి మన పరమేశ్వరుడికి కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.అందుకోసమే ఆ పరమ శివుని నందీశ్వరుని కొమ్ముల మధ్య లోనుంచి దర్శించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం