https://oktelugu.com/

 Yuvraj Singh : నేను, ధోని క్లోజ్ ఫ్రెండ్స్ కాదు.. అసలు టీమ్ లోనే క్లోజ్ ఫ్రెండ్స్ ఉండరు.. స్టార్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..

క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత.. క్యాన్సర్ వ్యాధిని జయించిన తర్వాత యువరాజ్ సింగ్ తనకిష్టమైన వ్యాపకాలను ఎంచుకున్నారు. ఇందులో బాగానే క్రికెట్ కామెంట్రీ చేస్తున్నారు. అప్పుడప్పుడు ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన టి20 వరల్డ్ కప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు.

Written By: , Updated On : February 16, 2025 / 06:49 PM IST
Yuvraj Singh-MS Dhoni

Yuvraj Singh-MS Dhoni

Follow us on

Yuvraj Singh : నేను, ధోని సన్నిహిత మిత్రులం అస్సలు కాదు. అసలు జట్టులోనే క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ ఉండరు. ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం.. అలాంటప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా అవుతారు.. జట్టు అవసరాల దృష్ట్యా మైదానంలో మాత్రమే సన్నిహితంగా ఉంటారు. ఆ తర్వాత ఎవరిదారి వారిదే. హోటల్ రూమ్లో కూడా విడివిడిగానే కదా ఉండేది. అలాంటప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా అవుతారు? జట్టు కోసం ఆడుతున్నప్పుడు సన్నిహితంగా ఉండక తప్పదు. దాన్ని చూసి క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటే ఎలా” ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు. టీమిండియా(team India) ఒకప్పటి దిగ్గజ ఆటగాడు యువరాజ్ సింగ్ ( Yuvraj Singh).

క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత.. క్యాన్సర్ వ్యాధిని జయించిన తర్వాత యువరాజ్ సింగ్ తనకిష్టమైన వ్యాపకాలను ఎంచుకున్నారు. ఇందులో బాగానే క్రికెట్ కామెంట్రీ చేస్తున్నారు. అప్పుడప్పుడు ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన టి20 వరల్డ్ కప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. అమెరికాలో క్రికెట్ వ్యాప్తి కోసం తన వంతు కృషి చేశారు. ఆ తర్వాత గోల్ఫ్( Golf) టోర్నీలలోనూ ఆడుతున్నారు. అయితే ఇటీవల యువరాజ్ సింగ్ ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూయర్ అడిగిన అనేక ప్రశ్నలకు యువరాజ్ సమాధానం చెప్పారు. మీకు, దీనికి మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందని ఇంటర్వ్యూయర్ అడగగా.. ” ఒక కెప్టెన్, ఆటగాడికి మధ్య ఉన్న సంబంధం మాత్రమే ఉంటుంది. మీకు ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. నేను, ధోని క్లోజ్ ఫ్రెండ్స్ అసలు కాదు. చాలామంది మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అని అనుకుంటారు. కానీ వారి అంచనా తప్పు. ఎందుకంటే నేను ఒక ఆటగాడిగా కెప్టెన్ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు అతనితో సన్నిహితంగా ఉండాల్సి ఉంటుంది. జట్టు అవసరాలు అలా ఉంటాయి కాబట్టి నేను కచ్చితంగా నా పాత్రను పోషించాలి. అంత తప్ప నేను, ధోని క్లోజ్ ఫ్రెండ్స్ అసలు కాదు. అసలు జట్టులో క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ ఉండరు. ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యమైన తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా అవుతారు” అని యువరాజ్ ప్రశ్నించారు.

నాడు తీసుకోలేదని చెప్పారు

మీరు త్వరగా కెరియర్ ముగించడానికి కారణం ఏంటని అడిగిన ప్రశ్నకు.. యువరాజ్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ” ఆరోజు నన్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేయలేదని ధోని చెప్పాడు. ఆ తర్వాత చాలా సేపు ఆలోచించాను. కుటుంబ సభ్యులతో చర్చించాను. సెలక్షన్ కమిటీ దృష్టిలో లేనప్పుడు ఆడటం దండగ అనుకున్నాను. అంతే క్రికెట్ కు వీడ్కోలు పలికాను. ఈ నిర్ణయం మొత్తం నేను తీసుకున్నది. ఎవరి ప్రమేయం లేదు. ఎవరి ఒత్తిడి కూడా లేదు.. జట్టు కోసం ఆడినప్పుడు సంతృప్తి ఉండేది. జట్టును గెలిపించినప్పుడు ఆనందం ఉండేది. అవి రెండు నేను నూటికి నూరు శాతం చేశానని అనుకుంటున్నాను. అంతే తప్ప ఇందులో నాకు వ్యక్తిగత స్వార్థం లేదని” యువరాజ్ వ్యాఖ్యానించాడు. ఐతే యువరాజ్ సింగ్ కెరియర్ అర్ధాంతరంగా ముగియడానికి కారణం ధోని అని గతంలో అతడి తండ్రి యోగ్ రాజ్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతని ఆరోపణలను యువరాజ్ కొట్టి పారిసినప్పటికీ.. అసలు విషయం పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పటివరకు యువరాజ్ ఎందుకు అర్ధంతరంగా తన కెరియర్ ముగించాడు అనే ప్రశ్నకు సమాధానం లభించలేదు. ఇప్పుడు తనంతట తానే చెప్పడంతో దాదాపు వస్తున్న విమర్శలు, ఆరోపణలు ఇకపై ముగిసిపోతాయని యువరాజ్ అభిమానులు చెబుతున్నారు.