IPL 2025 RCBvPBKS Final : ఈ కథనం రాసే సమయం వరకు కన్నడ జట్టు 8 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. తన స్నేహితురాలు పండంటి బిడ్డకు జన్మను ఇవ్వడంతో ఆమెను చూసేందుకు కన్నడ జట్టు ఓపెనర్ సాల్ట్ స్వదేశానికి వెళ్ళాడు. అతడు తిరిగి రావడం అనుమానమేనని వార్తలు వినిపించాయి. చివరికి జట్టు అవసరాలను దృష్టిలో పెట్టుకొని తిరిగి వచ్చాడు. మొత్తానికి ఫైనల్ మ్యాచ్లో ఆడాడు. వాస్తవానికి అతడి మీద భారీగా అంచనాలు ఉండేవి. కానీ అతడు వాటిని అందుకోడంల విఫలమయ్యాడు. 9 బంతుల్లో 16 పరుగులు చేసిన సాల్ట్.. రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. జోరు మీద ఉన్నాడు అనుకుంటుంటే.. ఒక్కసారిగా జేమి సన్ బౌలింగ్లో కెప్టెన్ అయ్యర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా పంజాబ్ జట్టులో ఆనందం వెళ్లి విరిసింది. ఫలితంగా 1.4 ఓవర్ లో 18 పరుగుల వద్ద కన్నడ జట్టు తొలి వికెట్ కోల్పోయింది.
Also Read : ఇరుగు దిష్టి.. పంజాబ్ దిష్టి.. అంతా ఈ నిమ్మకాయలతో, మిరపకాయలతో పోవాలి.. థూ: వైరల్ వీడియో
సాల్ట్ అవుట్ కావడంతో కన్నడ అభిమానులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. వాస్తవంగా అతడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడతాడని కన్నడ అభిమానులు అంచనా వేశారు. కానీ అతను మాత్రం తక్కువ స్కోరు మాత్రమే చేసి అవుట్ కావడంతో ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. ఈ ఐపీఎల్ సీజన్లో కన్నడ జట్టు ఓపెనర్ సాల్ట్ తొలి ఏడు ఇన్నింగ్స్ లలో 133 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 158.33, హైయెస్ట్ స్కోర్ 37 పరుగులు. ఆ తదుపరి 6 ఇన్నింగ్స్ లలో 270 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ అతడు దూకుడుగా బ్యాటింగ్ చేసి అర్థ సెంచరీలు నాలుగు చేశాడు. ఆ భరోసా ద్వారా కన్నడ జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. కాకపోతే అతడు ఫైనల్ మ్యాచ్లో నిరాశపరిచాడు. తద్వారా కన్నడ జట్టు భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేయలేకపోయింది.
సాల్ట్ ఈ సీజన్లో దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో.. బెంగళూరు భారీ పరుగులు నమోదు చేసింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీతో కలిసి అతడు పరుగుల వరద పారించాడు. దూకుడుగా బ్యాటింగ్ చేసి అదరగొట్టాడు. అందువల్లే అతడిని కన్నడ అభిమానులు ఆరడుగుల బుల్లెట్ అని అభివర్ణించడం మొదలుపెట్టారు. ఫైనల్ మ్యాచ్లో అతడు దారుణంగా విఫలమయ్యాడు. భారీగా పరుగులు చేయాల్సిన చోట త్వరగానే అవుట్ అయ్యాడు. తద్వారా కన్నడ అభిమానులు తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు. “బీభత్సంగా బ్యాటింగ్ చేస్తాడు అనుకుంటే సాల్ట్ ఇలా అవుట్ అయ్యాడు. ఉప్పు పాత్రర వేయాల్సిన చోట తనే వెంటనే వెనక్కి తిరిగి వచ్చేసాడని” కన్నడ అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.