Viral Video : అహ్మదాబాద్ వేదికగా అయ్యర్, పాటిదార్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన పంజాబ్ జట్టు కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు.. అహ్మదాబాద్ పిచ్ ఎరుపు, నల్ల నేలల మిశ్రమం కావడంతో వికెట్ కు సహకరిస్తుందని పంజాబ్ జట్టు కెప్టెన్ అంచనా వేశాడు. అందువల్లే అతడు బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇటీవల క్వాలిఫైయర్ -2 మ్యాచ్ జరిగినప్పుడు ముంబై కూడా ముందుగా బ్యాటింగ్ చేసింది. ఆ టార్గెట్ ను చివరి వరకు పోరాడి పంజాబ్ ఫినిష్ చేసింది. బహుశా దాన్ని అంచనా వేసి పంజాబ్ కెప్టెన్ బౌలింగ్ వైపు ఆసక్తి చూపించి ఉంటాడని తెలుస్తోంది.
Also Read : లక్ష్యం స్పష్టంగా ఉంటే.. ఈ నొప్పులు ఏం చేస్తాయి.. అయ్యర్ సమాధానానికి రవి శాస్త్రి ఫిదా!
ఇక బెంగళూరు జట్టు లోగడ మూడు పర్యాయాలు ఐపీఎల్లో చివరి అంచె వరకు వెళ్ళింది. మూడుసార్లు కూడా నిరాశతోనే వెను తిరిగి వచ్చేసింది. ఈసారి కూడా అలాంటి ఫలితం రావద్దని బెంగళూరు జట్టుతో పాటు అభిమానులు భావిస్తున్నారు. అందువల్లే తమ జట్టుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండడానికి.. ధైర్యంగా విజయం సాధించేలా చూడాలని దేవుళ్ళను ప్రార్థిస్తున్నారు. ఇక బెంగళూరు నగరంలో కన్నడ అభిమానులు తమ జట్టు కోసం వినూత్న ప్రయోగం చేశారు. ఇది సోషల్ మీడియాలో పడి సంచలనంగా మారింది. ఇంతవరకు ఐపీఎల్ ట్రోఫీ ఒక్కసారి కూడా గెలవక పోయినప్పటికీ కన్నడ జట్టుకు అభిమాన గణం విపరీతంగా ఉంది. అయితే తమ జట్టు ఫైనల్ వెళ్లిపోయిన నేపథ్యంలో.. ఎవరి దిష్టి తగలకుండా ఉండేందుకు కన్నడ అభిమానులు ఒక కారుకు భారీగా నిమ్మకాయలు కట్టారు. అదే స్థాయిలో మిరపకాయలు కూడా జోడించారు. దిష్టి మొత్తం వీటి ద్వారానే పోవాలని వారు పేర్కొంటున్నారు. ఆ కారును బెంగళూరు నగరం మొత్తం తిప్పారు. ” ఐపీఎల్ చరిత్రలో అద్భుతమైన జట్టు మాది. కానీ విపరీతమైన దిష్టి మా జట్టు మీద ఉంది. అందువల్లే మూడు పర్యాయాలు చివరి దశకు వెళ్లినప్పటికీ ట్రోఫీ అందుకోలేకపోయింది. అందువల్లే ఆ దిష్టి పోవడానికి ఈ ప్రయత్నం చేసాం. ఈ ప్రయత్నం ఫలిస్తుందని నమ్ముతున్నాం. మా జట్టు ఈసారి విజేతగా నిలుస్తుందనే నమ్మకం ఉందని” కన్నడ అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక కన్నడ జట్టు ఫైనల్ వెళ్లిన నేపథ్యంలో బెంగళూరులో ఐపీఎల్ ఫీవర్ తారాస్థాయికి చేరింది.. థియేటర్లు, షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద హోటల్స్ లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ఐపీఎల్ మ్యాచ్లు లైవ్ స్ట్రీమింగ్ పెడుతున్నారు. ఐపీఎల్ పేరు చెప్పి తమ వ్యాపారాలను జోరుగా సాగించుకుంటున్నారు. ఇక బెంగళూరులో పలు హోటల్స్ భారీగా ఆఫర్స్ పెట్టడంతో క్రికెట్ ఫ్యాన్స్ కిటకిటలాడుతున్నారు.
A car wrapped in nimbu and mirchi spotted in Bangalore to protect RCB from nazar ahead of the IPL Final. pic.twitter.com/VL8bMA5Hcr
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 3, 2025