IPL 2025 RCBvPBKS Final : వాస్తవానికి శత్రుదేశంతో ఏర్పడిన ఉద్రిక్తత నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణ తేదీలు మారిపోయాయి. అయినప్పటికీ క్రికెట్ మ్యాచ్లు చూసే విషయంలో అభిమానులు ఏమాత్రం తగ్గడం లేదు. పైగా టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఇటీవల క్వాలిఫైయర్ -2 మ్యాచ్ జరిగినప్పుడు వర్షం అంతరాయం కలిగించింది. ఆ సమయంలో మ్యాచ్ నిర్వాహన కాస్త ఆలస్యమైంది. అయినప్పటికీ జియో హాట్ స్టార్ లో 30+ కోట్ల లైవ్ వ్యూయర్ షిప్ నమోదయిందంటే క్రికెట్ ఫీవర్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read : ఆరడుగుల బుల్లెట్ అనుకుంటే.. 16 పరుగులకే అవుట్.. బెంగళూరుకు కోలు కోలేని షాక్!
ఇక అహ్మదాబాదులో ఐపీఎల్ ఫైనల్ జరుగుతున్న నేపథ్యంలో అతిరథ మహారధులు ఆ మ్యాచ్ చూసేందుకు హాజరయ్యారు. ఇందులో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఉన్నారు. అమీర్ ఖాన్ మ్యాచ్ చూడటం మాత్రమే కాదు.. కామెంట్రీ కూడా చెప్పాడు.. తనదైన హిందీలో.. పంచ్ లు వేసుకుంటూ ఆకట్టుకున్నాడు.. వాస్తవానికి అమీర్ ఖాన్ కు క్రికెట్ నాలెడ్జి చాలా ఎక్కువ. చాలా లోతుగా కామెంట్రీ చెప్పాడు. ప్రొఫెషనల్ కామెంటేటర్ కంటే గొప్పగా చెప్పాడు..” ఇంతమంది జనం హాజరయ్యారంటే మామూలు విషయం కాదు. మనదేశంలో క్రికెట్ అనేది ఒక మతం అయితే.. ప్రపంచంలో అదే అతిపెద్ద రిలీజియన్ అయిపోతుంది. ఎందుకంటే క్రికెటర్లను ఎంకరేజ్ చేయడంలో ఇండియన్స్ తర్వాత ఎవరైనా. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ఈ స్థాయిలో హాజరైన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఐపీఎల్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ గా అవతరించిందంటే మామూలు విషయం కాదు. ఇదంతా కూడా ఇండియన్ అభిమానుల వల్లే అంటూ” అమీర్ ఖాన్ వ్యాఖ్యానించారు.
అమీర్ ఖాన్ కామెంట్రీ చేస్తున్న దృశ్యాలను స్టార్ స్పోర్ట్స్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసింది. మిస్టర్ పర్ఫెక్ట్ మైకు అందుకొని తన గొంతును ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్లో వినిపిస్తున్నారని పేర్కొంది. ఐపీఎల్ ఫీవర్ ఈ స్థాయిలో ఉండడానికి ఇండియన్ అభిమానులే కారణమని.. అభిమానులను అలరించడానికి అమీర్ ఖాన్ ఇక్కడ దాకా వచ్చారని స్టార్ స్పోర్ట్స్ పేర్కొంది. అమీర్ ఖాన్ కామెంట్రీ ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ సరికొత్త అందాన్ని తీసుకొచ్చిందని పేర్కొంది. అమీర్ ఖాన్ ఇక్కడదాకా రావడం గొప్ప విషయమని.. ఆయన ఫైనల్ మ్యాచ్ కు రావడంతో అభిమానులు సందడి చేస్తున్నారని వ్యాఖ్యానించింది.