Jagan Mohan Reddy
Jagan: జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. చాలా రకాలుగా ఆయనకు ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకోవడం ఒక వంతు అయితే.. తనపై కేసులు తెరపైకి రాకుండా ఉండాలని చూసుకోవడం రెండో వంతు. అందుకోసమే కేంద్రంతో తగాదా పెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావించడం లేదు. అలా భావించిన చంద్రబాబు గత ఐదేళ్లుగా ఎంత ఇబ్బంది పడ్డారో జగన్మోహన్ రెడ్డికి తెలియంది కాదు. అలా చంద్రబాబును ట్రాప్ లో పెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి. అందుకే అదే ట్రాప్ లో పడకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఎక్కడా ఆయన గాబరా పడడం లేదు.
Also Read: విశాఖలో కూటమి దూకుడు.. అవిశ్వాస తీర్మానానికి సై!
* బీజేపీకి సంకేతం
జగన్మోహన్ రెడ్డి ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా విచిత్ర రాజకీయం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి( Bhartiya Janata Party) తాను ఒక ఆప్షన్ అని సంకేతం ఇస్తున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉద్యమ బాట పట్టారు. దక్షిణాది రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పక్షాలతో కలిసి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాలని జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. కానీ దానిని సున్నితంగా తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డి. ఇండియా కూటమికి దగ్గర కాలేదని బిజెపికి సంకేతాలు ఇచ్చారు. అలాగని దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడడం లేదని చెప్పుకునే ప్రయత్నం చేశారు. దీనిపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఉభయకుశ లోపరి అన్నట్టు వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి.
* కలిస్తే విజయం.. ఓడిపోతే వైరం
భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) బలమైన భాగస్వామ్య పక్షం. ఆ రెండు పార్టీలు కలిసిన ప్రతిసారి అద్భుత విజయం దక్కుతోంది. నవ్యాంధ్రప్రదేశ్లో సైతం ఆ రెండు పార్టీల మధ్య పొత్తు సత్ఫలితం ఇచ్చింది. 2014లో బిజెపితో పొత్తు పెట్టుకుని చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. 2024లో సైతం పొత్తు పెట్టుకుని విజయం సాధించారు. అయితే ఇదే చంద్రబాబు బిజెపి వ్యతిరేకించిన సందర్భంలో రెండు పార్టీలు ఓడిపోయాయి. అయితే చంద్రబాబు వైఖరి తెలిసిన కేంద్ర పెద్దలు జగన్మోహన్ రెడ్డి ఒక ఆప్షన్ గా కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. దానిని గ్రహించిన జగన్ సైతం అదే మాదిరిగా కేంద్ర పెద్దలకు వ్యతిరేకం కాకుండా చూసుకుంటున్నారు. అందుకే బిజెపి విషయంలో సానుకూలంగా ఉంటున్నారు. ఇండియా కూటమి విషయంలో తటస్థ వైఖరిని అవలంబిస్తున్నారు.