Homeక్రీడలుక్రికెట్‌Harmanpreet Kaur: వారెవా హర్మన్.. దిగ్గజాల సరసన..

Harmanpreet Kaur: వారెవా హర్మన్.. దిగ్గజాల సరసన..

Harmanpreet Kaur: టీమిండియా ఇంగ్లాండ్ మీద లార్డ్స్ లో జరిగిన ఏకైక టెస్టులో అద్భుతమైన విజయం సాధించింది. అంతేకాదు చరిత్రపుటల్లో సరికొత్త రికార్డును తన పేరు మీద రాసుకుంది. ఇంగ్లాండ్ జట్టు మీద.. ఇంగ్లాండ్ గడ్డమీద.. అది కూడా లార్డ్స్ లాంటి మైదానంలో టీమిండియా గెలవడం అంటే మామూలు విషయం కాదు.

ఐదు రోజులపాటు జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా ప్రారంభం నుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టింది. ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపించింది. బౌలింగ్లో క్రాంతి గౌడ్ ఇంగ్లాండ్ పతనాన్ని శాసించింది. ఐదు వికెట్లు పడగొట్టి లార్డ్స్ మైదానంలో సరికొత్త చరిత్ర సృష్టించిన భారతీయ బౌలర్ గా ఆవిర్భవించింది. యాస్తిక భాటియా సెంచరీ తో సత్తా చూపించింది. స్మృతి మందాన.. కెప్టెన్ కౌర్.. హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఇంగ్లాండ్ మైదానాల మీద భారత బౌలర్లకు అంతగా పట్టు ఉండదు. కానీ అది తప్పని నిరూపించారు భారతీయ మహిళలు.

లార్డ్స్ లో జరిగిన ఏకైక టెస్టులో విజయం సాధించడం ద్వారా హర్మన్ ప్రీత్ కౌర్ సరికొత్త రికార్డు తన పేరు మీద లిఖించుకుంది. ఈ మైదానంలో 1986లో కపిల్ దేవ్ నాయకత్వంలో టీమిండియా తొలి విజయాన్ని అందుకుంది. 2014లో ధోని నాయకత్వంలో టీమిండియా విజయం సాధించింది. 2021లో కోహ్లీ నాయకత్వంలో టీమిండియా అద్భుతమైన గెలుపును దక్కించుకుంది. ఇక భారత మహిళల క్రికెట్ ను పరిశీలనలోకి తీసుకుంటే కౌర్ నాయకత్వంలో టీమిండియా గొప్ప విజయాన్ని అందుకుంది.

ఇంగ్లాండ్ గడ్డమీద అది కూడా ప్రఖ్యాతమైన లార్డ్స్ మైదానంలో టీమిండియా కు విజయాన్ని అందించి దిగ్గజ కెప్టెన్ల సరసన కౌర్ చేరింది. టీమిండియా కు గొప్ప గొప్ప మహిళా క్రికెటర్లు నాయకత్వం వహించినప్పటికీ.. వారు చేరుకోలేని రికార్డును.. అందుకోలేని ఘనతను కౌర్ సొంతం చేసుకుంది. కౌర్ నాయకత్వంలో టీమిండియా ఇటీవల వన్డే వరల్డ్ కప్ సాధించింది. టి20 వరల్డ్ కప్ లో ఆశించిన స్థాయిలో ఆడ లేకపోయింది. అయినప్పటికీ ఆ ఓటమి నుంచి టీమిండియా త్వరగానే బయటపడింది. ఐదు రోజుల టెస్టులో సంపూర్ణ ఆధిపత్యాన్ని కొనసాగించి.. ఇంగ్లాండ్ జట్టుకు చెక్ పెట్టింది. తద్వారా త్రివర్ణ పతాకాన్ని ఇంగ్లీష్ గడ్డమీద రెపరెపలాడించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version