Dhurandhar Japan Box Office: ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ‘ధురంధర్’ సిరీస్ సృష్టించిన సునామీ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొదటి భాగం 1400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టగా, రెండవ భాగం ఏకంగా 1800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద రెండు భాగాలకు కలిపి ఈ చిత్రానికి 3200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓటీటీ లో కూడా ఈ సిరీస్ కి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. నెలల తరబడి ట్రెండ్ అవుతూ రికార్డు స్థాయిలో వ్యూస్ ని సొంతం చేసుకున్నాయి. ఇలా అత్యంత ప్రజాధరణ పొందిన ఈ చిత్రాన్ని, ఈ నెల 10 న జపాన్ దేశం లో గ్రాండ్ గా విడుదల చేశారు. ఇక్కడి జనాలు ఇండియన్ మూవీస్ ని ఏ రేంజ్ లో ఆదరిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
అదే తరహాలో ‘ధురంధర్’ చిత్రాన్ని కూడా ఆదరిస్తారేమో అని ఆశించారు మేకర్స్. కానీ ఈ చిత్రానికి అక్కడి ఆడియన్స్ నుండి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అక్కడి ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి మొదటి రోజున కేవలం 900 టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. ఇదే ప్రాంతంలో #RRR చిత్రానికి మొదటి రోజున ఏకంగా 8230 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. రామ్ చరణ్ , ప్రభాస్, అల్లు అర్జున్ వంటి పాన్ ఇండియన్ హీరోలకు కూడా వెయ్యికి పైగా టిక్కెట్లు ఈ దేశం లో అమ్ముడుపోయాయి. అలాంటిది ఇండియన్స్ ఎంతగానో ఇష్టపడిన ‘ధురంధర్’ చిత్రానికి ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని అసలు ఊహించలేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈ చిత్రానికి జపాన్ లో ఆదరణ దక్కకపోవడానికి ప్రధాన కారణం ప్రొమోషన్స్. #RRR చిత్రానికి ఆ రేంజ్ వసూళ్లు ఈ దేశంలో వచ్చాయంటే , అందుకు కారణం ఆ మూవీ టీం నెల రోజులు నాన్ స్టాప్ గా ప్రొమోషన్స్ చేయడం వల్లే. అక్కడి మీడియా తో కూడా పెద్ద ఎత్తున సంభాషణలు జరిపారు , అభిమానుల మధ్యలో తిరిగి ప్రమోట్ కూడా చేశారు. కానీ ధురంధర్ చిత్రానికి ఇలాంటి ప్రొమోషన్స్ అసలు జరగలేదు. అందుకే మొదటి వీకెండ్ మొత్తం చూసినా ఈ సినిమా టాప్ 25 గ్రాసర్స్ లో కూడా చోటు సంపాదించుకోలేక అతి చెత్త రికార్డు ని నమోదు చేసుకుంది. ఒకవేళ ప్రొమోషన్స్ భారీ ఎత్తున చేసుంటే ఫలితం మరోలా ఉండేదేమో అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.
