Chiranjeevi And Anil Ravipudi
Chiranjeevi And Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కుర్ర హీరోలతో సమానంగా పోటీ పడుతూ సినిమాలు చేయడమే కాకుండా వాళ్ళతో సరిసమానంగా ఆల్ టైం రికార్డ్స్ ని కూడా నెలకొల్పతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. రీ ఎంట్రీ తర్వాత ఆయన మూడు సార్లు వంద కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను అందుకొని సంచలనం సృష్టించాడు. కానీ ఆయన గత చిత్రం ‘భోళా శంకర్’ కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆయన ‘విశ్వంభర'(Viswambhara Movie) సినిమాని మొదలు పెట్టాడు. ప్రారంభం లో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉండేవి కానీ, టీజర్ తర్వాత ఆ అంచనాలన్నీ ఆవిరి అయిపోయాయి. గ్రాఫిక్స్ నాసిరకంగా ఉండడంతో అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తి ని వ్యక్తం చేసారు. దాదాపుగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత ఆయన అనిల్ రావిపూడి(Anil Ravipudi) తో ఒక సినిమా చేయబోతున్నాడు.
‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) చిత్రంతో 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి సంచలనం సృష్టించిన అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి తో అంతకు మించిన సూపర్ హిట్ ని కొట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. రీసెంట్ గానే స్క్రిప్ట్ వర్క్ ని మొదలు పెట్టిన అనిల్ రావిపూడి, ఫస్ట్ హాఫ్ ని డైలాగ్స్ వెర్షన్ తో సహా స్క్రిప్ట్ ని పూర్తి చేశాడట. రీసెంట్ గానే మెగాస్టార్ చిరంజీవి ని కలిసి ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని వినిపించగా, ఆయన పొట్ట చెక్కలు అయ్యే విధంగా నవ్వినట్టు తెలుస్తుంది. చిరంజీవి నుండి పూర్తి స్థాయి కామెడీ మూవీ వచ్చి చాలా ఏళ్ళు అయ్యింది. ఈ సినిమా ఆ లోటు ని పూడ్చబోతుందని., వింటేజ్ మెగాస్టార్ కామెడీ టైమింగ్ ని నేటి తరం ఆడియన్స్ కి తెలిసేలా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారని టాక్.
ఈ సినిమాకి టైటిల్ ని కూడా వెరైటీ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఉగాది సందర్భంగా ఆ టైటిల్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా వదిలే ప్లాన్ ఉందట. అది కూడా ఆ రోజే చేస్తారా లేదా అనేది తెలియాలి ఉంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత మెగాస్టార్ శ్రీకాంత్ ఓదెల తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి నిర్మాతగా నేచురల్ స్టార్ నాని వ్యవహరించబోతున్నాడు. సందీప్ వంగ తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు అని టాక్ ఉంది కానీ, అది ‘స్పిరిట్’ మూవీ లో ప్రత్యేక పాత్ర చేయబోతున్నాడా?, లేకపోతే చిరంజీవి తో ప్రత్యేకంగా ఒక సినిమా చేయబోతున్నాడా అనేది తెలియాల్సి ఉంది. మేమిద్దరం కలిసి ఒక సినిమా చేస్తున్నాం అనే హింట్ మాత్రం ఇప్పటికే సందీప్ వంగ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అనేకసార్లు పరోక్షంగా చెప్పుకొచ్చాడు.
Also Read: ఎన్టీఆర్ వేసుకున్న ఈ వాచ్ ధర ఎంతో తెలుసా..? ఆ డబ్బులతో ఒక సినిమానే తీసేయొచ్చు!