Chiranjeevi (2)
Chiranjeevi: తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తిరుగలేని హీరోగా చిరంజీవి టాలీవుడ్‌లో గుర్తింపు సంపాదించుకున్నారు. తన కష్టం మీద ఎదిగి మెగాస్టార్ అనిపించుకున్న చిరంజీవి చాలా మందికి ఒక రూల్ మోడల్. ఎన్నో సినిమాల్లో నటించి ఎందరికో ఒక ఇన్స్పిరేషన్‌గా నిలిచారు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి టాలీవుడ్ మెగాస్టార్ అనిపించుకున్నారు. అయితే చిరంజీవి సినిమాల్లో చేసిన కృషికిగాను ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఇప్పుడు యూకే ప్రభుత్వం చిరంజీవికి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రకటించింది. సినీ రంగంలో నాలుగు దశాబ్దాల నుంచి ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా యూకే ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. యూకే పార్లమెంట్‌లో మార్చి 19వ తేదీన ఈ అవార్డును చిరంజీవికి అందజేయనున్నారు. అయితే చిరంజీవికి ఇటీవల యూకే పౌరసత్వం ఉందనే వార్తలు వచ్చాయి. చిరంజీవి భారత పౌరుడు కాదని, యునైటెడ్ కింగ్ డమ్ పౌరసత్వం ఉందని సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. వీటిపై చిరంజీవి టీం కూడా స్పందించింది. తనకి యూకే పౌరసత్వం లేదని, జీవించి ఉన్నంత వరకు భారతీయుడిగానే ఉంటారని తెలిపింది.
Also Read: అయ్యగారు చాలా లేట్.. దాదాపు రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఏజెంట్
సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్‌ది 40 ఏళ్ల ప్రస్థానం. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని కేవలం సినిమా రంగంలోనే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. చాలా మంది అభిమానులకు చిరంజీవి అంటే ఒక ఎమోషన్. పునాదిరాళ్లు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి మొదటి ఇన్నింగ్స్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో హిట్ కోసం ట్రై చేస్తున్నారు. చిరంజీవి ఇండస్ట్రీలో తన డ్యాన్స్, నటనతో యూత్‌ను అప్పుడు ఎలా ఆకట్టుకున్నారో.. ఇప్పుడు కూడా అలానే ఆకట్టుకుంటున్నారు. టాలీవుడ్‌లో ఎన్నో రికార్డు చిరంజీవిపైన ఉన్నాయి. సినీ రంగంలో చిరంజీవి చేసిన కృషికి ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు కూడా వరించాయి. 9 ఫిలింఫేర్, 3 నంది అవార్డులతో పాటు పద్మభూషణ్, గతేడాది పద్మవిభూషణ్ అవార్డులు కూడా అందాయి. వీటితో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా చిరంజీవి చోటు సంపాదించుకున్నారు. ఇప్పటి వరకు చిరంజీవి 156 సినిమాల్లో నటించారు. ఒక పక్క సినిమాలు చేస్తూనే పలు సేవా కార్యక్రమాలు చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరలో నటిస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవి సరసన త్రిష, ఆషికా రంగనాథ్ అలరించనున్నారు. ఈ సినిమా వేసవిలో వచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ఓ సినిమా, అనిల్ రావిపూడితో కూడా సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలు అన్ని కూడా విశ్వంభర తర్వాత పట్టాలెక్కనున్నాయి.
Also Read: దిల్ రూబా’ ఫుల్ మూవీ రివ్యూ…