https://oktelugu.com/

Satyam Sundaram 2024 Movie Review : సత్యం సుందరం ‘ ఫుల్ మూవీ రివ్యూ

ఇక ఈ సినిమా ఆధ్యాంతం ప్రేక్షకుడిని అలరించే విధంగా ఉన్నప్పటికీ స్లోనరేషన్ తో ఉండడం అనేది కొంతవరకు ప్రేక్షకుడిని ఇబ్బంది పెట్టే అంశమనే చెప్పాలి. ఇక ఈ సినిమాని చూడాలంటే కొంచెం ఓపిక ఉండాలి.

Written By:
  • Gopi
  • , Updated On : September 29, 2024 9:42 am

    Satyam Sundaram movie review

    Follow us on

    Satyam Sundaram 2024 Movie Review : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి వాళ్ళు చేసే ప్రతి సినిమాలో కూడా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక తమిళం, తెలుగులో కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోల తర్వాత మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సూర్య ఒకరు. ఈయన తర్వాత వాళ్ళ తమ్ముడు అయిన కార్తీ కూడా రెండు భాషల్లో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన చేసిన అన్నీ సినిమాలు కూడా ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఇక కార్తీ హీరోగా వచ్చిన ‘సత్యం సుందరం’ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది.? ఈ సినిమాతో కార్తీ సక్సెస్ ని సాధించాడా.? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక పల్లెటూరులో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఏర్పడిన కొన్ని తగాదాల వల్ల ఊరు వదిలేసి వెళ్లిపోయిన హీరో కొన్ని సంవత్సరాల తర్వాత ఊరికి తిరిగి వస్తాడు. ఆయన రావడంతో అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన ఊరు వదిలి వెళ్లి పోవడానికి గల కారణమేంటి? తన కుటుంబ సభ్యులతో తను ఎలా కలిసిపోయాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇక కార్తీ తన కుటుంబ సభ్యులతో కలిసి పోయాడా? లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాని ’96 ‘ సినిమా దర్శకుడు అయిన ప్రేమ్ కుమార్ తెరకెక్కించాడు. నిజానికి 96 సినిమాలో విజయ్ సేతుపతి త్రిష ల మధ్య ఒక సెన్సిటివ్ సబ్జెక్టుని చాలా బాగా డీల్ చేశారు. ఇక అదే బాటలో ‘సత్యం సుందరం’ సినిమాని కూడా అలాగే చేయాలని చిన్న కాన్సెప్ట్ ని తీసుకొని దాని చుట్టూ ఒక మంచి కథని అల్లుకున్నాడు. అయితే ఆయన విజువల్ గా మనకు స్క్రీన్ మీద ఏదైతే చూపించాలి అనుకున్నాడో దాన్ని బలంగా చూపించే ప్రయత్నం అయితే చేశాడు. చిన్న చిన్న ఎమోషన్స్ ని చాలా స్ట్రాంగ్ గా చూపిస్తూ ప్రేక్షకుడికి సినిమాని దగ్గర చేసే ప్రయత్నం అయితే చేశాడు. ముఖ్యంగా ఆయన ఎమోషన్స్ మీద చాలా ఎక్కువ కేర్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళ మధ్య ఉండే కథాంశాలతో తెరకెక్కిన ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని అలరిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలో ఏదో ఒక రకమైన ఇబ్బందులను ఎదుర్కోవడం గానీ, మళ్లీ వాళ్లతో కలిసి పోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇలాంటి ఎమోషన్స్ ప్రేక్షకుడి జీవితంలో కూడా ఒక పార్ట్ అయి ఉంటాయి.

    కాబట్టి ఈ సినిమాని కూడా కుటుంబ నేపథ్యంలో తెరకెక్కించి ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఇక ముఖ్యంగా కార్తీ, అరవింద స్వామి మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. ముఖ్యంగా యాక్టింగ్ కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది. ఇక ఈ సినిమాతో దర్శకుడిగా ప్రేమ్ కుమార్ మరొక మెట్టు పైకి ఎక్కాడు. నిజానికి ఈయన ఎంచుకున్న సబ్జెక్టులు చాలా చిన్న సబ్జెక్టులే కానీ వాటిని ప్రేక్షకుడి హృదయానికి హత్తుకునేలా తీయడంలో ఆయనది అందవేసిన చేయి అని మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక గోవింద్ వసంతం అందించిన మ్యూజిక్ కూడా ఈ సినిమాకి చాలావరకు ప్లస్ అయింది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎమోషన్ సీన్స్ ని ఎలివేట్ చేయడంలో చాలావరకు ప్లస్ అవ్వడమే కాకుండా ప్రేక్షకుడి భావాలకు సైతం అద్దం పట్టేలా ఉండడం నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి…

    ఇక ఈ సినిమా ఆధ్యాంతం ప్రేక్షకుడిని అలరించే విధంగా ఉన్నప్పటికీ స్లోనరేషన్ తో ఉండడం అనేది కొంతవరకు ప్రేక్షకుడిని ఇబ్బంది పెట్టే అంశమనే చెప్పాలి. ఇక ఈ సినిమాని చూడాలంటే కొంచెం ఓపిక ఉండాలి. అలాంటి వారికి మాత్రమే ఈ సినిమా బాగా ఎక్కుతుంది. అలాగే సినిమా లెంత్ కూడా కొంచెం ఎక్కువ అవ్వడం సినిమాకి కొంతవరకు మైనస్ గా మారింది…ఇక ఈ సినిమాకి సూర్య జ్యోతికలు ప్రొడ్యూసర్లు అవ్వడం వల్ల సినిమా ప్రొడక్షన్ వాలస్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక ఆర్టిస్టు పర్ఫామెన్స్ విషయానికి వస్తే అరవింద్ స్వామి కార్తీ ఇద్దరు కూడా పోటాపోటీగా నటించారు. నిజానికి అరవిందస్వామి లాంటి సీనియర్ నటుడితో కార్తీ నటించి మెప్పించడం అనేది చాలా మంచి విషయమనే చెప్పాలి. ఒకరకంగా ఒక సీనియర్ నటుడు మన ఎదురుగా ఉన్నప్పుడు వాళ్లతో నటించడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని.. కానీ కార్తీ మాత్రం చాలా ఈజీగా నటించి మెప్పించాడు. అరవింద స్వామి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిమ పని అయితే లేదు. ఆయన స్క్రీన్ మీద కనిపించాడు అంటే సగటు ప్రేక్షకుడిని మెప్పిస్తూ ఉంటాడు. ఇంకా ఈ సినిమాలో కూడా అదే రిపీట్ అయిందనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత తెలుగు అమ్మాయి అయిన శ్రీదివ్య కూడా ఒక మంచి పాత్రలో నటించి మెప్పించింది. ఇక దేవదర్శిని కూడా తనదైన రీతిలో నటించి అక్కడక్కడ కామెడీ పంచులను కూడా పేల్చింది. ఇక మొత్తానికైతే అందరూ వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…

    టెక్నికల్ అంశాలు

    ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన ‘గోవింద్ వసంతం’ చాలా చక్కటి మ్యూజిక్ అందించడమే కాకుండా బ్యా గ్రౌండ్ స్కోర్ ను కూడా ప్రేక్షకుడి హృదయాన్ని రంజింపచేసేలా సీన్ యొక్క ఇంటెన్స్ ను బట్టి ఆయన చాలా చక్కటి మ్యూజిక్ అయితే అందించారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా అద్భుతంగా ఉంది. సినిమాకి ఎలాంటి షాట్స్ అయితే కావాలో అలాంటి షాట్స్ డిజైన్ చేసుకున్న ప్రేమ్ కుమార్ గారి విజన్ కి సినిమాటోగ్రాఫర్ అందించిన సహకారం కూడా చాలా చక్కగా కుదిరింది. అందువల్లే ప్రేక్షకుడి యొక్క దృష్టి వేరే విషయాలకు మళ్లించకుండా విజువల్ గా ఆయన కట్టిపడేశాడు. అలాగే సినిమా ఎమోషన్ సాఫీగా సాగడానికి కూడా ఆయన చాలావరకు కృషి చేశారు. ఇక మొత్తానికైతే విజువల్ గా ఈ సినిమా చాలా గ్రాండ్ ఇయర్ గా ఉందనే చెప్పాలి… ఇక ఎడిటర్ పనితీరు కూడా బాగునప్పటికీ కొన్ని సీన్లు మాత్రం లాగ్ అనిపించాయి వాటిని కూడా చాలా షార్ప్ కట్ ఎడిటింగ్ చేసి ఉంటే కొంత వరకు సినిమా లెంత్ తగ్గేది. ప్రేక్షకులకు కూడా కొంతవరకు బోర్ ఫీల్ రాకుండా ఉండేది…

    ప్లస్ పాయింట్స్

    కార్తీ, అరవింద స్వామి
    డైరెక్షన్
    మ్యూజిక్

    మైనస్ పాయింట్స్

    స్లో నరేషన్…
    సినిమా లెంత్ ఎక్కువగా ఉండటం…
    ఎడిటింగ్

    రేటింగ్
    ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.75/5

    చివరి లైన్

    కుటుంబ కథ సినిమా చూడాలి అనుకునే వాళ్ళు ఈ సినిమా చూడవచ్చు

    Sathyam Sundaram - Official Teaser (Telugu) | Karthi | Arvind Swami | Govind Vasantha | C. Premkumar