IPL 2025 : గతంలో క్రికెట్లో అనేక ఫిక్సింగ్ కుంభకోణాలు వెలుగు చూశాయి. అజహారుద్దీన్, క్రాన్యే వంటి ఆటగాళ్లు తమ విలువైన క్రీడా జీవితాన్ని కోల్పోయారు. క్రికెట్ నుంచి నిషేధానికి గురయ్యారు. అప్పుడే కాదు.. ఇప్పుడు కూడా అనేక చీకటి శక్తులు క్రికెట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఏదో విధంగా క్రికెట్ ను తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.. అయితే ఈ విషయాన్ని బిసిసిఐ ఆధ్వర్యంలోని అవినీతి నిరోధక భద్రత విభాగం (ACSU) గుర్తించింది. అయితే ఈసారి ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో.. ఫిక్సింగ్ లేదా అవినీతి కరమైన కార్యకలాపాలకు పాల్పడేందుకు హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యాపారవేత్త ప్రయత్నిస్తున్నాడని.. బిసిసిఐ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఐపీఎల్ జట్ల యజమానులు అప్రమత్తంగా ఉండాలని అవినీతి నిరోధక భద్రత విభాగం (ASCU) హెచ్చరించింది. ” హైదరాబాద్ నగరానికి చెందిన వ్యాపారవేత్త లీగ్ లో పాల్గొంటున్న వ్యక్తులను ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల అతడి కదలికలు సందేహస్పదంగా ఉన్నాయి. యజమానులు, ఆటగాళ్లు, కోచ్ లు, సహాయక సిబ్బంది, వ్యాఖ్యాతలు జాగ్రత్తగా ఉండాలి.. సదరు హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్తకు పంటర్లు, బుకీలతో స్పష్టమైన సంబంధాలు కలిగి ఉన్నాడు. అవినీతి కార్యకాల పాలలో సంబంధాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఐపిఎల్ లో ఆడుతున్న క్రికెటర్లతో, క్రికెట్ తో సంబంధం ఉన్న వ్యక్తులతో స్నేహం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఒకవేళ ఆ వ్యాపారి ఏవైనా సంభాషణలు జరిపితే.. జరపడానికి ప్రయత్నిస్తే.. వాటిని మా దృష్టికి తీసుకురావాలని” ACSU ఐపీఎల్ అన్ని జట్ల యజమానులకు సూచించింది.
Also Read : గెలిపించినందుకు ఈ హగ్.. ప్రేమతో ప్రీతిజింటా చేసిన పని వైరల్
వాటితో ఆకట్టుకునే ప్రయత్నం
హైదరాబాదు నగరానికి చెందిన ఆ వ్యాపారవేత్తకు చీకటి శక్తులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. క్రికెట్ ను శాసించడానికి.. ఆ చీకటి వ్యక్తులు కోరింది నెరవేర్చడానికి ఆ వ్యాపారవేత్త ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే ప్లేయర్లను మచ్చిక చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఖరీదైన ఆభరణాలు, ఖరీదైన వాహనాలు, ఖరీదైన గృహాలు ఆటగాళ్లకు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అయితే ఈ విషయాన్ని ACSU ముందుగానే పసిగట్టడంతో ఆ వ్యాపారి జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది. ” క్రికెటర్ల అభిమానిగా ఉంటాడు. అభిమానిగా నటిస్తాడు. అంతేకాదు ఐపీఎల్లో పాల్గొనే వారికి దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. తన వంతు ప్రబల్యాన్ని ప్రదర్శించుకోవడానికి జట్టు ఆటగాళ్లు బసచేసిన హోటల్ గదులకు వెళుతుంటాడు. బిసిసిఐ సిబ్బందితో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆటగాళ్లను ప్రవేటు పార్టీలకు ఆహ్వానించడానికి సిద్ధమవుతుంటాడు. ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులకు ఖరీదైన బహుమతులు పంపించడానికి వెనుకాడడు. అయితే ఇలాంటి చీకటి వ్యక్తులు క్రికెట్ మొత్తాన్ని నాశనం చేస్తారు. అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. క్రికెట్ అనేది భావోద్వేగంతో కూడుకున్న ఆట. ఇటువంటి ఆటలో చీకటి వ్యక్తులకు అవకాశం లేదు. అటువంటి వ్యక్తులు క్రికెట్ ను శాసించకూడదని ACSU తన నివేదికలో పేర్కొందని” ప్రఖ్యాత స్పోర్ట్స్ వెబ్ సైట్ crick Buzz వెల్లడించింది.
Also Read : చాహల్ నాలుగు వికెట్లు తీసిన వేళ.. ఆర్జే మహ్వేష్ ఇన్ స్టా స్టేటస్ లో ఏం పోస్ట్ చేసిందంటే..