PBKS Vs KKR IPL 2025: సోషల్ మీడియా లో అభిమానులు తిట్టిన తిట్లు చూశారో.. లేక ప్రీతిజింటా ముఖంలో ఆనందం చూడాలని భావించారో తెలియదు గాని.. పంజాబ్ జట్టు ఆటగాళ్లు నిజంగా పంజా దెబ్బ చూపించారు. చేసింది 111 పరుగులు అయినప్పటికీ.. చివరి వరకు పోరాడారు. ప్రతి బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మూడో వికెట్ కు కెప్టెన్ రహనే (17), సూర్యవంశీ (37) జోడించిన 55 పరుగుల భాగస్వామ్యం మాత్రమే పంజాబ్ బౌలర్లను కాస్త ఇబ్బంది పెట్టింది. కానీ ఈ దశలో ఎంట్రీ ఇచ్చిన చాహల్.. రాకెట్ లాగా దూసుకుపోయాడు. బంతులను మెలు తిప్పుతూ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ప్లేయర్లకు చుక్కలు చూపించాడు. అతని బౌలింగ్లో రహానే, సూర్యవంశీ, రమణ్ దీప్ సింగ్(0), రింకూ సింగ్(2) పెవిలియన్ చేరుకున్నారు. అసలు చాహల్ బంతి వేయడమే ఆలస్యం.. బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. జాన్సన్ కూడా తన వంతు పాత్ర పోషించాడు. అతడు కూడా మూడు వికెట్లు పడగొట్టాడు. అర్ష్ దీప్ సింగ్, బ్రాట్ లెట్, మాక్స్ వెల్ తీసింది తలా ఒక వికెట్ మాత్రమే అయినప్పటికీ.. కీలక సమయంలో కోల్ కతా నైట్ రైడర్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. దీంతో పంజాబ్ జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Also Read: శ్రేయస్ అయ్యర్ ను షారుక్ ఎందుకు వదిలేశాడో.. ప్రీతి జింటాకు తెలిసే ఉంటుంది..
ఎగిరి గంతేసిన ప్రీతి
ఈ మ్యాచ్ పై పంజాబ్ ఆటగాళ్ల కంటే ముందు.. పంజాబ్ జట్టు యజమాని ప్రీతి జింటాకే ఏమాత్రం ఆశలు లేవు. కానీ తమ జట్టు బౌలర్లు వికెట్లు పడగొడుతూ..కోల్ కతా జట్టుకు చుక్కలు చూపిస్తున్నప్పుడు ప్రీతి ఎగిరి గంతులు వేసింది. ఆటగాళ్ల ను కమాన్ కమాన్ అంటూ ప్రోత్సహించింది. పంజాబ్ జట్టు ఓడిపోవాల్సిన మ్యాచ్లో 16 పరుగుల తేడాతో గెలవడంతో.. ప్రీతి ఆనందానికి అవధులు లేవు. ఇదే క్రమంలో మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచిన యజువేంద్ర చాహల్ ను ప్రీతి దగ్గరకు తీసుకుంది. అంతేకాదు హగ్ ఇచ్చి అతడిని ప్రోత్సహించింది.. “ఓడిపోవాల్సిన మ్యాచ్లో గెలిపించావ్. నీ స్ఫూర్తి ఎప్పటికి నిలబడి ఉంటుంది. ఇలానే నువ్వు బౌలింగ్ చేస్తూ ఉండు. జట్టు నిన్ను చూస్తున్నప్పుడల్లా స్ఫూర్తి పొందుతూనే ఉంటుంది. జట్టులో సానుకూల దృక్పధాన్ని పెంచావు. కష్టకాలంలో నీలాంటి ఆటగాళ్లు కావాలి. అప్పుడే జట్టు విజయాలు సాధిస్తుంది. నువ్వు అద్భుతంగా బౌలింగ్ చేశావు అనే మాట చాలా తక్కువ. ఎందుకంటే తక్కువ పరుగులు చేసిన సమయంలో.. బలమైన ప్రత్యర్థి జట్టును బౌలింగ్ తో ఓడించడం అంత సులువు కాదు. కాని దానిని నువ్వు చేసి చూపించావు. నీ ఆట ఎప్పటికీ గుర్తుండిపోతుందని” చాహల్ ను ఉద్దేశించి ప్రీతి జింటా వ్యాఖ్యానించింది..
Also Read: నరాలు కట్ అయ్యాయి.. ఏమన్నా మ్యాచ్ నా..”పంజా” బ్ దెబ్బకు కోల్ “కథ” ముగిసింది
Preity Zinta was really happy with performance of Punjab Kings Today.
congrats @PunjabKingsIPL for a thriller victory. pic.twitter.com/iNvuXm6TJB— (@hiit_man45) April 15, 2025