Deputy CM Pawan Kalyan : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఈమధ్య కాలం లో తీవ్రమైన అనారోగ్యానికి గురి అవుతున్నాడు. ఫలితంగా ఆయన కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయడం లేదు, మరోపక్క ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఒకప్పటి దూకుడుని చూపించడం లేదు. నిన్న జరిగిన అత్యవసర క్యాబినెట్ మీటింగ్ కి ఆయన హాజరు కాలేదు. నేడు 16వ ఫైనాన్స్ కమీషన్ భేటీ జరిగింది. ఈ భేటీ కి పవన్ కళ్యాణ్ హాజరయ్యాడు కానీ, ఆయన చేతికి సెలైన్ బాటిల్ ఆనవాళ్లను చూసి అభిమానులు కంగుతిన్నారు. ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie) షూటింగ్ ని ఆయన పూర్తి చేయాల్సి ఉంది. కానీ వాయిదా పడింది. కేవలం నాలుగు రోజుల డేట్స్ ఇస్తే షూటింగ్ అయిపోతుంది, ఇవ్వడానికి ఏమి సమస్య నీకు?, అభిమానులను , నిర్మాతను ఇంకెన్ని రోజులు టార్చర్ చేస్తావు? అంటూ అభిమానులు మండిపడ్డారు.
Also Read : మొన్న కలెక్టర్ల రివ్యూ.. ఇప్పుడు క్యాబినెట్ భేటీ.. పవన్ ఎందుకలా?
కానీ నేడు విడుదలైన ఫోటోలలో ఆయన చేతికి ఉన్న సెలైన్ బాటిల్ ఆనవాళ్లను చూసి చల్లబడ్డారు. ముందు ఆరోగ్యం ముఖ్యం, సినిమాలు తర్వాత అయినా చేసుకోవచ్చు అని తమకు తాము సోషల్ మీడియా లో సర్దిచెప్పుకున్నారు. ఇంతకు పవన్ కళ్యాణ్ కి ఏమైంది?, అకస్మాత్తుగా ఎందుకు ఆయన ఈ స్థాయి అనారోగ్యానికి గురయ్యాడు అనేది ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. పవన్ కళ్యాణ్ కి చిన్నతనం నుండి ‘స్ఫూటం’ అనే లంగ్స్ సంబంధిత వ్యాధి ఉంది. ఇది అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ ని చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతూ వచ్చింది. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ లో ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా తీవ్రంగా దెబ్బతినింది. అందుకు కారణం ఈ స్ఫూటం సమస్య ఉండడం వల్లనే అట. ఫిబ్రవరి నెల నుండి పవన్ కళ్యాణ్ కి ఈ సమస్య మరింత తీవ్రం అయ్యింది. దీంతో ఆయన ప్రతీ రోజు ట్రీట్మెంట్ తీసుకుంటూ వస్తున్నాడు. ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదట పడడం మొదలైంది.
కానీ మార్క్ శంకర్(Mark Shankar) కి సింగపూర్ లో అగ్నిప్రమాదం జరిగింది అనే విషయాన్నీ తెలుసుకొని ఆయన నాలుగు రోజులపాటు సింగపూర్ లోనే ఉండిపోయాడు. అంతకు ముందు రెండు రోజులు ఆయన మన్యం జిల్లాలో పర్యటించాడు. అంటే ట్రీట్మెంట్ కి దాదాపుగా వారం రోజుల గ్యాప్ వచ్చింది. దీంతో మళ్ళీ జ్వరం తిరగబడింది అట. ప్రతీ రోజు డాక్టర్ల పర్వవేక్షణ లోనే పవన్ కళ్యాణ్ అడుగులు వేయాలి. కానీ వారం రోజుల గ్యాప్ రావడం తో, జ్వరం తీవ్రంగా తిరగబడడంతో ఆయన నిన్న క్యాబినెట్ మీటింగ్ కి హాజరు కాలేకపోయాడు. నిన్న మొత్తం ఆయన బెడ్ కి పరిమితమై విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. నేడు కూడా ఆయన సెలైన్ బాటిల్ ఎక్కించుకొనే 16వ ఫైనాన్స్ కమిటీ మీటింగ్ కి హాజరు అయ్యాడు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి పై ఇది సోషల్ మీడియా లో వినిపిస్తున్న ప్రచారం మాత్రమే. పూర్తి స్థాయి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.
Also Read : మరోసారి వాయిదా పడిన ‘హరి హర వీరమల్లు’..కన్నీటి పర్యంతం అయిన నిర్మాత!