IPL 2025: ఈ సీజన్ ఐపీఎల్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే భారత్, పాకిస్తాన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ఈ సీజన్ ని రద్దు చేస్తున్నట్టు కాసేపటి క్రితమే BCCI అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ నిర్ణయాన్ని తీసుకుంది. నిన్న ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగుతున్న సమయంలో పాక్ సైన్యం నుండి డ్రోన్ల దాడి జరగగా, మన ఇండియన్ ఆర్మీ వాటిని సమర్థవతంగా ఎదురుకొని, కూల్చేవేసింది. ఈ నేపథ్యం లో జమ్మూ మొత్తం లైట్ అవుట్ చేసి, మ్యాచ్ ని ఓవర్లలో ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంజాబ్ కింగ్స్ పది ఓవర్లలో 122 పరుగులు తీసింది. ఈ మ్యాచ్ పూర్తిగా జరిగి ఉండుంటే పంజాబ్ దే గెలుపు అయ్యుండేది. కానీ బ్యాడ్ లక్. నిమిషాల వ్యవధిలో హంగామా తో కూడిన స్టేడియం నిర్మాణాయుష్యంగా మారిపోయింది.
Also Read: పంజాబ్ vs ఢిల్లీ ఐపీఎల్ మ్యాచ్ అర్ధాంతరంగా రద్దు
ముందుగా మ్యాచులను రద్దు చేయకుండా, సేఫ్టీ ప్రాంతాల్లో నిర్వహించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్న ఉద్రిక్తత పరిస్థితుల్లో రిస్క్ తీసుకోలేక మ్యాచులను రద్దు చేయాల్సి వచ్చింది. అయితే పరిస్థితులన్నీ మామూలు స్థితికి వచ్చిన తర్వాత మ్యాచులను మళ్ళీ కొనసాగిస్తారో లేదో చూడాలి. ఎందుకంటే గతంలో కూడా కరోనా లాక్ డౌన్ కారణంగా కొన్ని రోజులు మ్యాచులను ఆపారు. కానీ మళ్ళీ లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత పునః ప్రారంభించారు. మళ్ళీ అలాంటి పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే అకస్మాత్తుగా ఇలాంటి పరిస్థితులు రావడం పాపం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం అభిమానులకు మింగుడు పడడం లేదు. ఎందుకంటే IPL టోర్నమెంట్ మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్ ని గెలుచుకోని టీం గా ఆర్సీబీ ని ఎలా ట్రోల్ చేస్తూ ఉంటారో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ సీజన్ లో ఆర్సీబీ(RCB) విశ్వరూపం చూపించింది.
ఇప్పటి వరకు 11 మ్యాచులు ఆడితే, 8 మ్యాచులు గెలిచి మూడు మ్యాచులు ఓడిపోయి, టేబుల్ లో టాప్ 2 స్థానం లో నిలబడింది. అదే గుజరాత్ టైటాన్స్ టీం నెంబర్ 1 స్థానం లో నిలబడగా, మూడవ స్థానంలో పంజాబ్ కింగ్స్ టీం, నాల్గవ స్థానం లో ముంబై ఇండియన్స్ టీం, 5వ స్థానం లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం, ఆరవ స్థానం లో కోల్ కత్తా నైట్ రైడర్స్ టీం, 7 వ స్థానం లో లక్నో సూపర్ జైన్ట్స్ టీం, 8 వ స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం, 9 వ స్థానం లో రాజస్థాన్ రాయల్స్ టీం, పదవ స్థానం లో చెన్నై సూపర్ కింగ్స్ టీం నిలిచాయి. ఒకవేళ మ్యాచులు తిరిగి మొదలైతే ఈ టేబుల్ లోని టీమ్స్ స్థానాలు అనూహ్యంగా మార్పులు చెందవచ్చు.