IPL 2025 PBKS vs DC : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాల మైదానంలో ఐపీఎల్లో భాగంగా ఢిల్లీ, పంజాబ్ జట్ల మధ్య గురువారం మ్యాచ్ జరుగుతుంది. స్టేడియంలో ఫ్లడ్ లైట్ల సమస్య తలెత్తి సాంకేతిక సమస్య కారణంగా మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.. ఈ మైదానంలో ఈనెల 11న జరగాల్సిన మ్యాచ్ ను కూడా నిర్వాహకులు రద్దు చేశారు. దానిని గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ వేదికకు మార్చారు.. రెండు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రధైన నేపథ్యంలో చెరో పాయింట్ లభించింది.
మే 11న జరగాల్సిన మ్యాచ్ కూడా..
పాకిస్తాన్ తో నెలకొన్న పరిస్థితుల్లో నేపథ్యంలో మే 11న పంజాబ్ – ముంబై జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు చేశారు. ఆ మ్యాచును అహ్మదాబాద్ మైదానంలో నిర్వహించనున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కౌంటర్ దాడులు చేసే ప్రమాదం ఉన్న నేపథ్యంలో.. ముందస్తు జాగ్రత్తగా ఇండియన్ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ధర్మశాల ఎయిర్పోర్ట్ ను టెంపరరీ గా క్లోజ్ చేసింది. అయితే గురువారం జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడుతుందని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా మ్యాచ్ నిర్వహించుకోవచ్చు అని కేంద్రం బీసీసీఐకి అనుమతి ఇచ్చింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.
అంతేకాదు మ్యాచ్ రద్దు అయిన నేపథ్యంలో రెండు జట్లకు చెరొక పాయింట్ కేటాయిస్తామని వివరించారు. ప్రేక్షకులను జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించడంతో వారు వెంటనే తమ తమ గృహాలకు అత్యంత భద్రత మధ్య తిరుగు పయనమయ్యారు.
IPL Governing Council chairman Arun Dhumal is seen requesting people to leave the stadium after the Punjab Kings vs Delhi Capitals match was called off in Dharamsala.
: @rvmoorthyhindu #IPL2025 | #PBKSvsDC pic.twitter.com/BH9jmZaYHC
— Sportstar (@sportstarweb) May 8, 2025