IPL 2025 : త్వరలో నిర్వహించే ఐపిఎల్ మెగా వేలంలో బీసీసీఐ సరికొత్త నిబంధనలను అమలు చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రిటైన్డ్ ఆటగాళ్ల జాబితా పై పరిమితి విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. “రైట్ టు మ్యాచ్ కార్డు” అమల్లోకి తీసుకు వస్తుందని ప్రచారం జరుగుతోంది.. అన్ క్యాప్డ్, రిటర్మెంట్ ఆటగాళ్లకు సంబంధించిన విధివిధానాలను, ఫ్రాంచైజీ జట్ల వ్యాలెట్ విలువను పెంచేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.. అయితే ఈ నిబంధనలపై ఊహాగానాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. వీటికి ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాతే మెగా వేలం తేదీని ఖరారు చేస్తామని బీసీసీఐ పెద్దలు అంతర్గత సంభాషణలో పేర్కొంటున్నారు. దీనికంటే ముందు ప్రస్తుత ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు విన్నవించిన దాని ప్రకారం ఐపీఎల్లో రెండు కొత్త విధానాలను మార్చేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్ విధానం గురించి విస్తృతమైన చర్చ నడుస్తోంది.. ఈ విధానంపై ఇప్పటికే రోహిత్, విరాట్ వంటి ఆటగాళ్లు బహిరంగంగానే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.. ఇలాంటి విధానం వల్ల జట్టుకు ఎంతో ఉపయుక్తమైన ఆల్ రౌండర్ ఆటగాళ్ల సేవలను ఎక్కువగా వినియోగించుకోలేకపోతున్నామని అప్పట్లో వారు పేర్కొన్నారు. అయితే దీనిపై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మాజీ పేస్ బౌలర్ జహీర్ ఖాన్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు..” ఆటగాళ్లు సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు ఈ నిబంధన ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిబంధకంగా ఉండదని” పేర్కొన్నారు. అయితే ఈ నిబంధన ప్రస్తుతం వ్యాపార పరంగానూ లాభం చేకూర్చుతోంది. భారీగా పరుగులు నమోదు చేసేందుకు ఇది అవకాశం కల్పిస్తోంది. అందువల్ల ప్రేక్షకులు మైదానాలకు బారులు తీరుతున్నారు. అయితే దీనిపై బీసీసీఐ ఒక తుది నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది.
అమలు చేస్తుందా? కొనసాగిస్తుందా?
ఇక ఒకే ఓవర్ లో రెండు బౌన్సర్లను అనుమతిస్తున్న విషయంలో బీసీసీఐ తెగ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా? అదేవిధంగా అమలు చేయాలా? అనే ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. అయితే ఈ రెండు నిబంధనలను అమలు చేస్తే.. ఫ్రాంచైజీ జట్లు ఎలా స్పందిస్తాయి? వారి స్పందన ఎలా ఉంటుంది? అనే విషయాలపై తుది అంగీకారం వచ్చిన తర్వాత బీసీసీఐ వీటిపై ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఒకవేళ ఈ నిబంధనలు రద్దు చేస్తే నవంబర్లో దేశవాలి టి20 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ అమలు చేసే అవకాశం ఉంది. అయితే నవంబర్ లోపు ఈ నిబంధనలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.