OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటుగా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి ‘ఓజీ’. ఈ సినిమా పేరు ఎత్తితే అభిమానులు పూనకాలు వచ్చి ఊగిపోతుంటారు. అది ఏ హీరో సినిమా ఈవెంట్ అయినా ఇది సర్వసాధారణం అయిపోయింది. రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘సరిపోదా శనివారం’ ప్రమోషనల్ ఈవెంట్స్ లో ఓజీ గురించి ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. హీరో నాని కూడా ఆ చిత్రం గురించి ఎంతో ప్రత్యేకంగా మాట్లాడాడు. దీనిని బట్టీ ఆ సినిమా మీద కేవలం అభిమానుల్లో , ప్రేక్షకుల్లో మాత్రమే కాదు, సెలబ్రిటీస్ లో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ ని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ , లేదా మొదటి పాటని విడుదల చేస్తారని ఇది వరకే నిర్మాత డీవీవీ దానయ్య తెలిపాడు.
దానికి సంబంధించిన అప్డేట్ రేపు రాబోతున్నాడు. బ్రాండ్ న్యూ పోస్టర్ తో పాటకి సంబంధించిన అప్డేట్ ని చెప్పనున్నారు. పార్లమెంట్ హాల్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ‘అతను పవన్ కాదు..తుఫాన్’ అన్న మాటలు నేషనల్ లెవెల్ లో ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ బిట్ ని ఉపయోగించుకొని మొదటి పాటని తయారు చేసినట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ విషయంలో అభిమానుల్లో చిన్న అయ్యోమయ్యం నెలకొంది. మార్చి 27 న ఈ సినిమా విడుదల అవుతుందని కొందరు, ఏప్రిల్ లో విడుదల అవుతుందని మరికొందరు కామెంట్స్ చేసారు. కానీ రీసెంట్ గా ‘సరిపోదా శనివారం’ ప్రెస్ మీట్ లో నిర్మాత దానయ్య మాట్లాడుతూ ‘ఓజీ ఏప్రిల్ నెల కంటే ముందే వస్తుంది’ అని అధికారికంగా ప్రకటించాడు.
అంటే మార్చి 27 వ తేదీ దాదాపుగా ఖరారు అయిపోయినట్టే. రేపే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన పోస్టర్ ద్వారా తెలియచేయనున్నారు. కేవలం ఒక్క గ్లిమ్స్ వీడియో కి పూనకాలతో ఊగిపోయిన అభిమానులు, ఇక మొదటి పాట విన్న తర్వాత ఏ స్థాయిలో రచ్చ చేస్తారో చూడాలి. ఇప్పటికే 70 శాతం కి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, మిగిలిన భాగం షూటింగ్ వచ్చే నెల నుండి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఈ నేపథ్యంలో, అయన బాధ్యతలకు ఏ మాత్రం భంగం కలగకుండా ఉండేందుకు విజయవాడలోనే షూటింగ్ కార్యక్రమాలు తలపెట్టాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. ఓజీ షూటింగ్ కి సంబంధించిన సెట్స్ అమరావతిలోని వేయనున్నారు.