Suryakumar Yadav : సూర్య అలా చేసి ఉంటే.. కచ్చితంగా మేమే టి20 వరల్డ్ కప్ గెలిచేవాళ్ళం.. దక్షిణాఫ్రికా స్పిన్ బౌలర్

వెస్టిండీస్ లోని బార్బడోస్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా పై భారత్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. 2007లో విజేతగా ఆవిర్భవించిన భారత్.. ఆ తర్వాత 17 ఏళ్లకు మళ్ళీ కప్ సాధించింది.

Written By: NARESH, Updated On : August 31, 2024 10:30 pm

Shamsi sensational comments on Suryakumar Yadav's catch in T20 World Cup 2024

Follow us on

Suryakumar Yadav : ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా – భారత్ హోరాహోరీగా తలపడ్డాయి..క్లాసెన్ క్రీజ్ లో ఉన్నంతవరకు గెలుపు దక్షిణాఫ్రికా వైపే ఉంది. అద్భుతమైన బంతితో అతడిని భారత బౌలర్ హార్దిక్ పాండ్యా బోల్తా కొట్టించాడు. ఇక అప్పట్నుంచి మ్యాచ్ క్రమంగా భారత్ వైపు మొగ్గింది. ముఖ్యంగా సూర్యకుమార్ అందుకున్న క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య అతడు క్యాచ్ అందుకున్న తీరు క్రికెట్ చరిత్రలో అద్భుతమైన ఘట్టంగా నిలిచిపోయింది.. పైనుంచి వేగంగా దూసుకు వస్తున్న బంతి గమనాన్ని గమనిస్తూనే.. మరోవైపు బౌండరీ తాడు వద్ద తన పాదాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ.. చిరుతల పరిగెత్తుకుంటూ వచ్చి సూర్యకుమార్ క్యాచ్ అందుకున్నాడు. ఆ సమయంలో సౌత్ ఆఫ్రికా విజయానికి ఆరు బంతుల్లో 15 పరుగులు అవసరం అయ్యాయి. ఆ ఓవర్ హార్దిక్ పాండ్యా వేశాడు. అతడు వేసిన తొలి బంతిని డేవిడ్ మిల్లర్ బలంగా లాంగ్ ఆఫ్ దిశగా కొట్టాడు. అతడు కొట్టిన వేగాన్ని చూసి చాలామంది అది సిక్స్ గా వెళుతుందని భావించారు. కానీ బౌండరీ లైన్ వద్ద అత్యంత అద్భుతంగా సూర్యకుమార్ యాదవ్ అందుకున్నాడు. ముందుగా ఆ బంతిని సిక్సర్ వెళ్లకుండా సూర్య అడ్డుకున్నాడు. ఆ తర్వాత సమన్వయం కోల్పోయి బంతిని గాల్లోకి విసిరాడు. బౌండరీ రోప్ దాటాడు. మళ్లీ గ్రౌండ్లోకి ఎంట్రీ ఇచ్చి బంతిని అందుకున్నాడు.

దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఏమంటున్నాడంటే..

సూర్యకుమార్ యాదవ్ అందుకున్న ఈ క్యాచ్ మ్యాచ్ ను ఒకసారిగా భారత్ వైపు తిప్పింది. ఒకవేళ అది సిక్స్ వెళ్లినా మిల్లర్ నాట్ అవుట్ గా నిలిచేవాడు. ఫలితంగా రిజల్ట్ వేరే విధంగా ఉండేది. అయితే ఇది అవుట్ కాదని అప్పట్లో దక్షిణాఫ్రికా అభిమానులు వాదించారు. అయితే సరిగ్గా ఇన్ని రోజులకు దక్షిణాఫ్రికా స్పిన్ బౌలర్ షంసీ తొలిసారిగా స్పందించాడు. ట్విట్టర్ వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో గల్లి క్రికెట్ ఆడుతున్న కొందరు ఆటగాళ్లు కనిపించారు. అయితే బౌండరీ లైన్ వద్ద ఓ ఫీల్డర్ అందుకున్న క్యాచ్ ను కొంతమంది యువకులు పరీక్షిస్తున్నారు. ఇదే విధానంలో టి20 వరల్డ్ కప్ ఫైనల్లో పరీక్షించి ఉంటే ఫలితం ఇంకో విధంగా ఉండేదని.. అప్పుడు మిల్లర్ నాట్ అవుట్ గా ప్రకటించేవారని షంసీ వివరించాడు. దీనిపై టీమ్ ఇండియా అభిమానులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో మరో ట్వీట్ చేశాడు. ” నేను భారత క్రికెట్ జట్టు అభిమానులను బాధపెట్టాలని ఆ ట్వీట్ చేయలేదు. నేను చేసిన ట్వీట్ వారికి అర్థమైనట్టు లేదు. నేను సరదాగా ఈ వీడియోను అప్లోడ్ చేశాను. దీనిని మీరు ఒక జోక్ లాగా తీసుకోండి” అంటూ అతను ట్విట్ చేశాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ అందుకున్న సమయంలో బౌండరీ తాడు కాస్త వెనక్కి జరిగిందని అప్పట్లో సౌత్ ఆఫ్రికా అభిమానులు ఆరోపించారు. దానిని బలపరుస్తూ షంసీ ఈ ట్వీట్ చేశాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి.