IPL 2025: ఈ స్టేజిలో కేంద్రం అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. అయితే ఫైరింగ్ ఆగిపోయింది అనుకొని.. బీసీసీఐ పెద్దలు నిన్న సాయంత్రం ఒక కీలక అప్డేట్ ఇచ్చారు. ఆదివారం భేటీ అవుతామని.. ఐపీఎల్ రీస్టార్ట్ చేస్తామని హింట్ ఇచ్చారు. కానీ ముష్కర దేశం మళ్లీ ఫైరింగ్ మొదలు పెట్టడంతో పరిస్థితి మొదటికి వచ్చింది. ఆదివారం ఇంటర్నల్ గా భేటీ అయిన బీసీసీఐ పెద్దలు.. పంజాబ్ జట్టును మినహా మంగళవారం నాటికి మిగతా జట్లు వారి వారి వేదికల వద్ద అందుబాటులో ఉండాలని ఆదేశాలు ఇచ్చింది. కొత్త షెడ్యూల్ అతి త్వరలో రూపొందిస్తామని.. ఐపీఎల్ తిరిగి మొదలు పెడతామని బోర్డు జట్లకు సూచించింది. ఈ ఆదేశాలు మౌఖికంగా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఫారెన్ ప్లేయర్లకు సంబంధించి కూడా జట్ల యాజమాన్యాలు ప్రణాళికలు రూపొందించుకోవాలని బీసీసీఐ స్పష్టం చేసింది.
బిసిసిఐ యాక్షన్ ప్లాన్ ఎలా ఉందంటే..
మే 13 వరకు ప్లేయర్లు జట్ల యాజమాన్యాలకు అందుబాటులో ఉండాలి.. మే 25న ఐపీఎల్ ముగించాలని బీసీసీఐ నిర్ణయించిన (గత షెడ్యూల్ ప్రకారం) నేపథ్యంలో.. మిగిలిన లీడ్ మ్యాచ్లను మొత్తం డబుల్ హెడర్ విధానంలో క్లోజ్ చేయాలని బోర్డ్ అంచనా వేస్తోంది. ఇక శుక్రవారం ఐపీఎల్ వాయిదా పడిన తర్వాత ఫారిన్ ప్లేయర్లలో చాలామంది తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. అయితే వారందరినీ తిరిగి ఇండియాకు రప్పించడానికి యాజమాన్యాలు ప్లాన్లు చేస్తున్నాయి. అయితే మే 25న ఐపీఎల్ క్లోజ్ చేయాలని అనుకుంటున్న తరుణంలో.. ప్లేయర్ లందరినీ మంగళవారం నాటికి రిపోర్ట్ చేయాలని.. ఫ్రాంచైజీలు సూచించినట్టు తెలుస్తోంది.
ఇంకా 16 మ్యాచులు
ఐపీఎల్ లో ఇంకా 16 మ్యాచ్లో నిర్వహించాల్సి ఉంటుంది. మే 25 న ఐపీఎల్ క్లోజ్ కావాలంటే డబుల్ హెడర్ విధానంలో మ్యాచులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా మ్యాచులు నిర్వహించే అవకాశం లేకపోయినందున బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వెహికల్గానే మ్యాచులు నిర్వహించడానికి అవకాశం ఉందని తెలుస్తోంది..”ఐపీఎల్ రీస్టార్ట్ గురించి ప్రణాలికలు రూపొందిస్తున్నాం. న్యూ షెడ్యూల్ రిలీజ్ చేసే ముందు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఐపీఎల్ ప్రయారిటీ గురించి.. ప్రభుత్వానికి మరొకసారి వివరించాల్సి ఉంది. ఐపీఎల్ రీస్టార్ట్ చేసే ముందు.. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ చాలా అవసరం. ఈ ప్రక్రియ మొత్తం సకాలంలో పూర్తయితే వెంటనే.. ఐపీఎల్ రీస్టార్ట్ డేట్ అనౌన్స్ చేస్తాం. మాకు దేశమే ఫస్ట్ ప్రయారిటీ. కేంద్రం చెప్పగానే కీలక మ్యాచ్ అయినప్పటికీ క్యాన్సిల్ చేసాం. అప్పటికప్పుడు ఆడియన్స్ ను, ఫ్యాన్స్ ను అర్జంట్ బేసిక్ ప్రయారిటీ మీద వారి వారి ప్రాంతాలకు తరలించామని ” బీసీసీఐ సెక్రటరీ దేవ్ జీత్ సైకియా వెల్లడించారు.