Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన ఎంటైర్ కెరీర్లో చాలా సినిమాలు చేసి మంచి విజయాలను అందుకోవడమే కాకుండా అక్కినేని ఫ్యామిలీ బాధ్యతలను ముందుకు తీసుకెళ్తూ తమ అభిమానులను ఆనందపరుస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి ఆయన సరైన సక్సెస్ లను అయితే సాధించడం లేదు. ఇక తను వందో సినిమా చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఆ సినిమాని పక్కన పెట్టి మరి తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజు (Lokesh Kanaka Raj) చేస్తున్న కూలీ (Cooli) సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఒక గ్లింప్స్ అయితే బయటికి వచ్చింది. నాగార్జున బ్యాక్ షాట్ ఒక్కటే సినిమా మొత్తాన్ని డామినేట్ చేసింది. ఇక రజనీకాంత్ వేసిన విజిల్స్ ని సైతం నాగార్జున ఒక బ్యాక్ షాట్ తో డామినేట్ చేసి పారేసాడు అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్ అయితే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా నాగార్జున ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని సంపాదించుకోబోతున్నాడనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది.
మరి ఈ సినిమాలో నాగార్జున నెగటివ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమాతో నాగార్జున ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటాడు. తన కెరియర్ కి ఈ సినిమా ఎలా యూజ్ అవుతుంది అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…
ఇక గ్లింప్స్ చూసిన కొంత మంది సినిమా మేధావులు సైతం నాగార్జున గ్లింప్స్ లోనే కాదు సినిమాలో కూడా రజనీకాంత్ ని డామినేట్ చేయబోతున్నాడు అంటూ వాళ్ళ అభిప్రాయాలను అయితే తెలియజేస్తున్నారు. మరి మొత్తానికైతే నాగార్జున ఈ సినిమాలో 30 నుంచి 40 నిమిషాల పాటు కనిపించి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేయాబోతున్నాడట.
మరి ఈ 40 నిమిషాల వ్యవధిలోనే రజనీకాంత్ ను డామినేట్ చేసి తన నటనతో ప్రేక్షకులందరిని తిప్పుకునే ప్రయత్నం కూడా చేస్తాడు అంటూ తన అభిమానులు సైతం మంచి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…ఈ సినిమాతో నాగార్జున మంచి గుర్తింపును సంపాదించుకుంటే పాన్ ఇండియాలో తనకి చాలా మంచి మార్కెట్ ఏర్పడుతుంది…దాంతో తన వందో సినిమాకి ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు అయితే లభిస్తోంది…