IPL 2024 : ఐపీఎల్ 17 వ సీజన్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నది. ఇప్పటివరకు జరిగిన చాలా మ్యాచ్ లు చివరి ఓవర్ వరకు సాగుతున్నాయి. ఒకటి, రెండు మ్యాచ్ లు మినహా మిగతావన్నీ నువ్వా, నేనా అన్నట్టుగా సాగుతున్నాయి. దీంతో ప్రేక్షకులు సీట్ చివర్లో కూర్చొని మ్యాచ్ చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీవీలో చూస్తున్నవారు గోళ్ళు కొరుకుతూ టెన్షన్ తో మ్యాచ్ వీక్షించాల్సిన ఉత్కంఠ నెలకొంది. దీనికి తోడు జియో సినిమా యాప్ ఐపీఎల్ మ్యాచ్ లను ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా స్ట్రీమ్ చేస్తోంది. దీంతో మొబైల్ లో ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్ లను చూస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగింది.
ఐపీఎల్ అంటే ధనాధన్ క్రికెట్ కు మారుపేరు. బ్యాటర్ల దూకుడు, బౌలర్ల విన్యాసం, ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఈసారి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఐపీఎల్ లో మొత్తం 10 జట్లు ఉండగా.. కేవలం నాలుగు జట్లు ఆడుతున్న ఆటనే అభిమానులు ఎక్కువగా చూస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఆడుతున్న మ్యాచ్ లకు ఎక్కువగా వ్యూయర్ షిప్ నమోదవుతోందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఈ నాలుగు జట్లు ఆడే మ్యాచ్ లకు మైదానాలు నిండిపోతున్నాయి. స్టార్ స్పోర్ట్స్ తో పాటు, జియో సినిమా ద్వారా చూసే వారి సంఖ్య కూడా విపరీతంగా ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లను అభిమానులు అంతగా పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. ఈ టీమ్స్ మ్యాచ్ ఆడుతున్నాయంటే అభిమానులు అంతగా ఆసక్తి ప్రదర్శించడం లేదు. చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ ఆడే మ్యాచ్ లను మాత్రం ఆసక్తితో చూస్తున్నారు.
చెన్నై జట్టులో ధోని లాంటి దిగ్గజ ఆటగాడు ఉన్నాడు. గత ఏడాది చెన్నై జట్టు ట్రోఫీ దక్కించుకుంది. ఈ టీంకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ టీం ఆడుతున్న మ్యాచ్ అంటే అభిమానుల్లో ఆసక్తి తారాస్థాయికి చేరుతోంది.
ఐపీఎల్ 17వ సీజన్ వరకు వచ్చినప్పటికీ ఇంతవరకు బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా కప్ దక్కించుకోలేదు. విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడు ఉండడంతో ఆ జట్టు ఆడే మ్యాచ్ లంటే అభిమానులకు విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంటోంది. ఇటీవల ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఈ జట్టు మహిళలు ట్రోఫీ దక్కించుకున్నారు. దీంతో ఈ సీజన్ లో ఈ జట్టుపై అభిమానులు భారీగా అంచనాలు పెంచుకున్నారు.
ముంబై జట్టులో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉండడంతో అభిమానులు ఈ జట్టు ఆడే మ్యాచ్ ల పట్ల క్యూరియాసిటీతో ఉంటున్నారు. హిట్ మాన్ బ్యాటింగ్ చూసేందుకు ప్రేక్షకులు మైదానాలకు పోటెత్తుతున్నారు. హార్దిక్ పాండ్యా – రోహిత్ శర్మ మధ్య వివాదం ఏర్పడిన నేపథ్యంలో ముంబై ఆడే మ్యాచ్ లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.
ఐపీఎల్ లో ఇప్పటివరకు ఈ జట్టు సాధించినంత హైయెస్ట్ స్కోర్.. ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ సాధించింది.. దీంతో ఈసారి హైదరాబాద్ జట్టు పై అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా జట్టులో ఆటగాళ్లు ఆకాశమే చెలరేగిపోతున్నారు. దీంతో వారి ఆట చూసేందుకు ప్రేక్షకులు మైదానాలకు ఎగబడుతున్నారు. గత ఏడాది మెరుగైన ప్రదర్శన చేయకపోయినప్పటికీ హైదరాబాద్ జట్టుకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉండడం విశేషం.
ఇక మిగతా టీమ్ లలో దిగ్గజ ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. వారికి ఫ్యాన్ బేస్ తక్కువగా ఉంది. దీనికి తోడు ఆ జట్లు ఆడే మ్యాచ్లు అత్యంత చప్పగా సాగుతున్నాయి. భారీ స్కోర్లు నమోదు కావడం లేదు. దీంతో ఈ టీంలు ఆడే మ్యాచ్ ల పట్ల అభిమానులు అంతగా ఆసక్తి చూపడం లేదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు
Innings Break‼️
A Virat Kohli masterclass propels #RCB to 182/6
Will #KKR chase it down?
Match Updates ▶️ https://t.co/CJLmcs7aNa #TATAIPL | #RCBvKKR pic.twitter.com/J0a7geIo52
— IndianPremierLeague (@IPL) March 29, 2024