Ishan Kishan: క్రికెటర్లు అభిమానులను ఆకట్టుకునేందుకు మైదానంలో, మైదానం బయట ఫ్యాన్స్‌కు ఆటో గ్రాఫ్‌లు ఇస్తుంటారు. అప్పుడప్పుడు కామెడీ చేస్తుంటారు. డాన్సులు చేస్తారు. సెలబ్రేషన్స్ సమయంలోనూ సిగ్నిచర్ మూమెంట్స్‌తో సందడి చేస్తుంటారు. ఇదంతా ఆటలో భాగం. బయట టీం రూల్స్‌కు అందరూ కట్టుబడి ఉండాలి. ఇష్టానుసారం వ్యవహరించడానికి వీలులేదు. కానీ ఐపీఎల్ ముంబై ఇండియన్స్ టీం ఓపెనర్ ఇషాన్ కిషన్.. టీం రూల్స్ క్రాస్ చేశాడు. ఫ్యాన్స్ కోసం నిబంధనలకు విరుద్ధంగా ఫన్నీ డ్రెస్‌కోడ్‌లో ఎయిర్ పోరన్టుకు వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
రూల్స్ బ్రేక్..
ముంబై ఇండియన్ క్రికెటర్ అయిన ఇషాన్.. జట్టు లోగో ఉన్న ఫన్నీ సూపర్ హారో డ్రెస్‌తో ఎయిర్ పోర్టుకు బస్సులో బయల్దేరాడు. తన వెరైటీ గెటప్‌లో అక్కడి ప్రయాణికులను, సిబ్బందిని నవ్వించాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. టీం ప్రొటోకాల్స్ పాటించకపోవడంతో జట్టు అతడికి శిక్ష విధించింది.
రూల్స్ విషయంలో కఠినంగా..
ముంబై జట్టు కోచ్, సహాయక సిబ్బంది ఆటగాళ్ల విషయంలో కఠినంగా ఉంటుంది. ప్రొటోకాల్ పాటించకపోయినా, హోటల్ కాల్స్‌కు స్పందిచకున్నా వాళ్ల ప్రవర్తనలో తేడా వచ్చినా ఎంతటి ఆటగాడినీ ఉపేక్షించదు. రూల్స్ బ్రేక్ చేసిన వాళ్లు రోజంతా ఒకటే డ్రెస్‌లో ఉండాల్సి వస్తుంది. తాజాగా ఇషాన్ కూడా అదే శిక్ష విధించింది ముంబై టీం మేనేజ్‌మెంట్.
వరుస ఓటములు..
ఇదిలా ఉంటే ఐపీఎల్ సీజన్–17ను ముంబై టీం ఓటమితో మొదలు పెట్టింది. వరుసగా మూడు మ్యాచ్‌లలోనూ పరాజయంపాలైంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. దీంతో కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మళ్లీ రోహిత్‌కే పగ్గాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.