RCB Vs LSG 2024: ఆడుతున్నది సొంత మైదానంలో.. సొంత ప్రేక్షకుల సంఘీభావం ఉంది.. మైదానం మీద అవగాహన ఉంది. గొప్ప గొప్ప ఆటగాళ్లు ఉన్నారు.. అంతకుమించి బౌలర్లు ఉన్నారు.. అయినప్పటికీ ఏం ఉపయోగం? అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా మారింది బెంగళూరు జట్టు పరిస్థితి.. మంగళవారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్లో లక్నో జట్టు చేతిలో బెంగళూరు 28 పరుగుల తేడాతో ఓడిపోవడాన్ని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.. అన్ని జట్లు సొంత మైదానాలలో వీరవిహారం చేస్తుంటే.. బెంగళూరు, ముంబై జట్లు మాత్రం సొంత మైదానాలలో ఓడిపోతున్నాయి. చిన్నస్వామి మైదానంలో బెంగళూరు జట్టు వరుసగా రెండవ పరాజయాన్ని నమోదు చేసింది.
ఆకట్టుకొని బౌలింగ్.. నిరాశ కలిగించే ఫీల్డింగ్.. బెంగళూరు జట్టును ఇబ్బంది పెడుతున్నాయి. మంగళవారం నాటి మ్యాచ్ లోనూ ఇవే పునరావృతమయ్యాయి. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు ఆటగాడు పురన్ ఇచ్చిన సులభమైన క్యాచ్ ను బెంగళూరు వికెట్ కీపర్ అనూజ్ రావత్ నేలపాలు చేశాడు. ఇదే మంగళవారం నాటి మ్యాచ్ లో లక్నో గెలవడానికి కారణమైంది. ఒకవేళ ఆ క్యాచ్ గనుక రావత్ పట్టి ఉంటే లక్నో కథ వేరే విధంగా ఉండేది.
రీస్ టోప్లే వేసిన 17వ ఓవర్ లో ఈ సంఘటన జరిగింది. మూడు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పురన్ భారీ షాట్ ఆడబోయాడు.. అది మిస్ టైమింగ్ కు గురి కావడంతో స్వైర్ లెగ్ దిశగా గాలిలో లేచింది. బంతి చాలా ఎత్తులోకి ఎగిరింది. దానిని అందుకునేందుకు వికెట్ కీపర్ అనూజ్ రావత్, యశ్ దయాళ్ పరుగులు తీశారు. తను క్యాచ్ అందుకుంటానని రావత్ చెప్పడంతో యశ్ దయాళ్ వెనుక వేశాడు. రావత్ డైవ్ చేసినప్పటికీ క్యాచ్ అందుకోలేకపోయాడు.
ఇలా లభించిన జీవదానంతో పురన్ మైదానంలో తాండవం చేశాడు. బెంగళూరు బౌలర్ల పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. 160 పరుగుల వద్ద సమాప్తం కావలసిన లక్నో జట్టు స్కోరును 182 వద్దకు చేర్చాడు.. బెంగళూరు ఎదుట 183 లక్ష్యాన్ని నిలిపాడు.. ఈ లక్ష్యాన్ని అందుకోలేక బెంగళూరు.. ఒకవేళ రావత్ ఆ క్యాచ్ పట్టి ఉంటే లక్నో అంతటి స్కోర్ చేయగలిగేది కాదు. కేవలం బ్యాటింగ్ మాత్రమే కాదు.. ఫీల్డింగ్ లోనూ పురన్ సత్తా చాటాడు. మూడు క్యాచ్ లు, ఒక రన్ ఔట్ తో బెంగళూరు జట్టును ఇబ్బంది పెట్టాడు. మైదానంలో చాలావరకు పరుగులను సేవ్ చేశాడు.
Anuj Rawat today,
– Dropped Nicholas Pooran when he was on 2. Went on to score 40(21)
– Played 11(21) stinker with the batThat performance vs CSK has done more harm than good to us.
— Hriday (Fan-Account) (@Hriday1812) April 2, 2024